Publish Date: Wed, 03 Nov 2021 (20:20 IST)
Updated Date: Wed, 03 Nov 2021 (20:21 IST)
శబరిమల ఆలయాన్ని ఈనెల 15వ తేదీ నుంచి రెండు నెలల కోసం తెరవనున్నారు. అయ్యప్ప స్వామి భక్తుల మండల పూజ కోసం ఆలయాన్ని 15వ తేదీ నుంచి తెరవనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
ఇవాళ చితిర అత్తవిశేష పూజ సందర్భంగా కూడా ఆలయాన్ని ఒక రోజు పాటు తెరిచారు. పూజ ముగిసిన తర్వాత రాత్రి 9 గంటలకు ఆలయాన్ని మూసి వేయనున్నారు. అయ్యప్ప భక్తులకు వర్చువల్ క్యూ బుకింగ్ వ్యవస్థ ద్వారా అనుమతి కల్పిస్తున్నారు.
దైవ దర్శనం కోసం వచ్చేవారు కచ్చితంగా వ్యాక్సినేషన్ సర్టిఫికేట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో వ్యాక్సినేట్ అయి ఉండాలి లేదా 72 గంటల లోపు తీసిన ఆర్టీపీసీఆర్ రిపోర్ట్‌ను సమర్పించాల్సి ఉంటుంది.