Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇస్రో ఖాతాలో మరో విజయం.. కక్ష్యలోకి పీఎస్ఎల్వీసీ46

Advertiesment
ఇస్రో ఖాతాలో మరో విజయం.. కక్ష్యలోకి పీఎస్ఎల్వీసీ46
, బుధవారం, 22 మే 2019 (09:06 IST)
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఖాతాలో మరో విజయం చేరింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో ఉన్న సతీశ్ ధావన్ అంతరిక్ష పరిశోధనా సంస్థ షార్ నుంచి బుధవారం తెల్లవారుజామున 5:30 గంటలకు పోలార్ శాంటిలైట్ లాంచ్ వెహికల్-సి46(పీఎస్ఎల్‌వీ) నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది. 
 
615 కిలోల బరువున్న రాడార్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ రిశాట్ -28న 555 కిలోమీటర్ల ఎత్తులో నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది. దీంతో శాస్త్రవేత్తలో ఆనందం వెల్లివిరిసింది. రిశాట్-2బీఆర్1 ఉపగ్రహం కాలపరిమితి రెండేళ్లు. 
 
సరిహద్దుల్లో శత్రువుల కదలికలను, ఉగ్రశిబిరాలను ఇది సులభంగా గుర్తిస్తుంది. కాబట్టి రక్షణ శాఖకు ఇది ఎంతో కీలకం కానుంది. అలాగే, వ్యవసాయం, అటవీ, విపత్తు నిర్వహణకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇస్రో చేపట్టిన పీఎస్ఎల్‌వీ ప్రయోగాల్లో ఇది 48వది కావడం గమనార్హం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎగ్జిట్ పోల్స్‌తో అధైర్యపడొద్దు : ప్రియాంకా గాంధీ