Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పరాయి పురుషుడితో భార్య శృంగారం... వీడియోను చూసి భర్త ఏం చేశాడో తెలుసా?

కట్టుకున్న భర్త విదేశాల్లో ఉపాధి కోసం వెళ్తే.. భార్య మాత్రం గ్రామంలోని ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆ వ్యక్తి ఆమెను మోసగించాడు. తనతో పాటు మరో ముగ్గురు స్నేహితులతో కలిసి అత్యాచారం చేసి.. వీ

Advertiesment
పరాయి పురుషుడితో భార్య శృంగారం... వీడియోను చూసి భర్త ఏం చేశాడో తెలుసా?
, శుక్రవారం, 3 ఆగస్టు 2018 (09:15 IST)
కట్టుకున్న భర్త విదేశాల్లో ఉపాధి కోసం వెళ్తే.. భార్య మాత్రం గ్రామంలోని ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆ వ్యక్తి ఆమెను మోసగించాడు. తనతో పాటు మరో ముగ్గురు స్నేహితులతో కలిసి అత్యాచారం చేసి.. వీడియో తీశాడు. ఆ తర్వాత ఆ వీడియో చూపి బెదిరిస్తూ తమ కామవాంఛ తీర్చుకున్నారు. అంతటితో ఆగని ఆ కామాంధులు.. ఆ వీడియోను విదేశాల్లో ఉన్న కట్టుకున్న భర్తకు పంపించారు. దాన్ని చూసి షాకైన భర్త.. స్వదేశానికి వచ్చి.. భార్య, పిల్లలపై పెట్రోల్ పోసి తగలబెట్టి... తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
పంజాబ్ రాష్ట్రంలోని కపుర్తలా జిల్లా కలసింగియా గ్రామానికి చెందిన కుల్విందర్‌ సింగ్‌(35) అనే వ్యక్తి ఉపాధి కోసం జోర్డాన్‌ దేశానికి వెళ్లాడు. అక్కడ పని చేస్తూ ఆరునెలలకు ఒకసారి వచ్చిపోయేవాడు. ఆయన భార్య, పిల్లలు మాత్రం స్వగ్రామం కలసింగియాలోనే నివశిస్తూ వచ్చారు. ఈ క్రమంలో గ్రామంలోని ఓ వ్యక్తితో కుల్విందర్‌ భార్య వివాహేతర సంబంధం పెట్టుకుంది. 
 
ఆ వ్యక్తి ఆమెను నమ్మించి మోసం చేశాడు. అతనితోపాటు.. అతని స్నేహితులతో కూడా అత్యాచారం చేయించాడు. ఆ తర్వాత ఆమె అశ్లీల వీడియోను రికార్డు చేసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడసాగారు. చివరకు ఆ వీడియోను భర్తను పంపడంతో కుల్విందర్‌ స్వదేశానికి తిరిగొచ్చాడు. 
 
భార్య వ్యవహారం బయటపడటంతో తట్టుకోలేక పెట్రోల్‌ పోసి కుటుంబాన్ని చంపి, తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు కపుర్తలా పోలీసులు వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చార్జింగ్ పెట్టిన ఎలక్ట్రిక్ స్కూటర్ పేలిపోయింది.. ఎక్కడ... ఎలా?