Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కర్ణాటకలో ఘోర ప్రమాదం.. లోయలో పడిన పెళ్లి బస్సు.. ఇద్దరు మృతి

కర్ణాటకలో ఘోర ప్రమాదం.. లోయలో పడిన పెళ్లి బస్సు.. ఇద్దరు మృతి
, మంగళవారం, 22 ఫిబ్రవరి 2022 (12:11 IST)
కర్ణాటకలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 60మంది ప్రయాణిస్తున్న ఓ పెళ్లి బస్సు 30 అడుగుల లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. 27 మంది గాయాలపాలయ్యారు. 
 
వివరాల్లోకి వెళితే.. లోయలో పడిన పెళ్లి బస్సు సుబ్రహ్మణ్య ఆలయంలో శనివారం వివాహ వేడుకలు జరిగాయి. గౌరిబిడనూర్​ తాలుకాకు చెందిన ప్రజలు బస్సులో ఆ వివాహానికి తరలివెళ్లారు. తిరిగివస్తున్న క్రమంలో 10గంటల ప్రాంతంలో 30అడుగుల లోయలో పడిపోయింది.
 
ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. క్షతగాత్రులను దొడ్డబల్లాపుర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 
 
అయితే ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని మాత్రం ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పహాడీషరీఫ్‌లో లారీ డ్రైవర్‌పై కాల్పులు