Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హనీ ట్రాప్, పక్కా ప్లాన్ ప్రముఖులకే చుక్కలు చూపించిన జంట

హనీ ట్రాప్, పక్కా ప్లాన్ ప్రముఖులకే చుక్కలు చూపించిన జంట
, సోమవారం, 14 ఫిబ్రవరి 2022 (23:50 IST)
వాళ్ళిద్దరు బాగా చదువుకున్నారు. కానీ ఎక్కడా సరిగ్గా ఉద్యోగం చేయలేకపోయారు. సులువుగా డబ్బులు సంపాదించే మార్గాన్ని అన్వేషించారు. ఇద్దరూ ప్రేమికులు కావడం.. త్వరలోనే పెళ్ళి కూడా చేసుకోవాలనుకున్నారు. ఐతే వాళ్లకు డబ్బు సమస్యగా మారింది. దాంతో నా ప్రియురాలు అందంగా ఉంటుందని చెప్పి గదిలోకి పిలిచి ప్రముఖులను మోసం చేసి డబ్బులు వసూలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. ఎక్కువ రోజులు ఆటలు సాగవుగా..

 
కేరళ రాష్ట్రం కొచ్చి ప్రాంతానికి చెందిన రెన్జీనా, షాజహాన్‌లు ఇద్దరూ ఉన్నత విద్యను అభ్యసించారు. ఇద్దరూ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేశారు. కానీ అక్కడే వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. బాస్ తరచూ తిడుతూ ఉండడంతో ఆ ఉద్యోగం మానేశారు. ఇంకొక సాఫ్ట్వేర్ కంపెనీలో చేరారు.

 
అక్కడా అదే పరిస్థితి. ఇలా ఇంక చేయలేమని నిర్ణయించుకున్నారు. ఎలాగైనా డబ్బులు సంపాదించాలనుకున్నారు. సులువుగా డబ్బులు సంపాదించే మార్గాన్ని ఎంచుకున్నారు. రెన్జీనా అందాన్ని వాడుకుని హనీ ట్రాప్‌తో ప్రముఖులను లైన్లో పెడదామనుకున్నారు. పారిశ్రామికవేత్తలు, బంగారు దుకాణదారులు, సమాజంలో పేరున్న వ్యక్తులకే వల వేశారు. 

 
మొదటగా పదిమంది విఠులను ఆకర్షించారు. నా ప్రియురాలు చాలా అందంగా ఉంటుంది. రేటు చాలా తక్కువ. మీకు బాగా సహకరిస్తుందంటూ ప్రముఖుల ఫోన్ నెంబర్లకు మెసేజ్‌లు పంపించేవారు. ఇందులో కొంతమంది కనెక్టయ్యారు.

 
దీంతో ఇద్దరిని ట్రాప్ చేశారు. గదిలో పంపినట్లుగా పంపించి రెన్జీనా గట్టిగా కేకలు వేస్తూ ప్రముఖుడిని పట్టుకునేది. నన్ను బలవంతం చేస్తున్నవంటూ పోలీసులకు ఫోన్ చేస్తానంటూ బెదిరించేది. మాకు లక్ష రూపాయలు వెంటనే ఇవ్వాలంటూ డిమాండ్ చేసేది. ఇలా కొంతమంది మోసం చేశారు ఆ ఇద్దరు.

 
కానీ ఎక్కువరోజులు ఇది సాధ్యం కాదుకదా పోలీసులకు వచ్చిన పక్కా సమాచారంతో వీరిద్దరు ఉండే ప్రాంతానికి వెళ్ళారు. అప్పటికే ఒక విఠుడు ఆ ప్రాంతంలో ఉండడం..అతన్ని బ్లాక్ మెయిల్ చేస్తూ కనిపించడంతో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వీరి దగ్గర కేరళ రాష్ట్రంలోని ప్రముఖుల లిస్ట్ ఉండడం చూసి నివ్వెరపోయారు. ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాలికపై కామాంధులు సామూహిక అత్యాచారం