Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మేం వ్యభిచారం చేయట్లేదు.. పెళ్లి చేసుకోబోతున్నాం..

Advertiesment
మేం వ్యభిచారం చేయట్లేదు.. పెళ్లి చేసుకోబోతున్నాం..
, బుధవారం, 28 ఆగస్టు 2019 (09:25 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్‌లో వ్యభిచారం విచ్చలవిడిగా సాగుతున్నట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ వింగ్‌ను ఏర్పాటు చేశారు. ఈ వింగ్ ఆకస్మిక తనిఖీలు చేపట్టి 36 మందిని యువతులను అదుపులోకి తీసుకున్నారు. అయితే, వారు మాత్రం పోలీసులకు ఝలక్ ఇచ్చారు. తాము వ్యభిచారం చేయడం లేదనీ, పెళ్లిచేసుకోబోతున్నట్టు చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, మీరట్‌లో జోరుగా వ్యభిచారం జరుగుతున్నట్టు వచ్చిన వార్తలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు... రంగంలోకి దిగి ఓ హోటల్‌పై దాడి చేశారు. అపుడు కొన్ని జంటలను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మొత్తం 36 మందిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో హోటల్ సిబ్బంది కూడా ఉన్నారు.
 
పోలీసుల అదుపులో ఉన్న అమ్మాయిలు తమ ముఖాన్ని చున్నీతో కప్పేసుకోగా, అబ్బాయిలు హెల్మెట్లతో కవర్ చేసుకున్నారు. వీరిని విచారించే సమయంలో విస్తుపోయే విషయాలు చెప్పారు. వారు చెప్పింది విని పోలీసులే షాకయ్యారు. తాము త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామని, తమను వదిలేయాలని కొందరు ప్రాధేయపడ్డారు. తమకు నిశ్చితార్థం కూడా అయిపోయిందని, కావాలంటే చూడాలంటూ నిశ్చితార్థపు ఉంగరాలను కూడా చూపించారు. దీంతో పోలీసులు అటువంటి జంటలను అక్కడే వదిలిపెట్టారు. మిగతా వారిని మాత్రం స్టేషన్‌కు తీసుకెళ్లి విచారిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చలాన్లు రెట్టింపు కావు.. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు