Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాకిస్థాన్ గాజులు తొడుక్కోలేదంటున్న ఫరూక్ అబ్దుల్లా.. ఎందుకు?

జమ్మూకాశ్మీర్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నేషనల్ కాన్ఫెరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా ఇటీవలి కాలంలో శత్రుదేశం పాకిస్థాన్‌కు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేస్తున్న భారత వ్యతిరేక వ్యాఖ్

Advertiesment
పాకిస్థాన్ గాజులు తొడుక్కోలేదంటున్న ఫరూక్ అబ్దుల్లా.. ఎందుకు?
, గురువారం, 16 నవంబరు 2017 (12:54 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నేషనల్ కాన్ఫెరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా ఇటీవలి కాలంలో శత్రుదేశం పాకిస్థాన్‌కు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేస్తున్న భారత వ్యతిరేక వ్యాఖ్యలను సగటు భారతీయుడు జీర్ణించుకోలేక పోతున్నాడు. 
 
మొన్నటికిమొన్న పాక్ ఆక్రమిత కాశ్మీర్ పాకిస్థాన్‌కు చెందుతుందన్నారు. అందువల్ల పీఓకేను పాకిస్థాన్‌కు అప్పగించాలంటూ కోరారు. ఇదే కాశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారమన్నారు. దీనిపై బీజేపీ నేతలు మండిపడ్డారు.
 
తాజాగా మరో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పీవోకే విషయంలో చూస్తూ ఊరుకోవడానికి పాకిస్థాన్‌ గాజులు తొడుక్కోలేదంటూ బారాముల్లాలో వ్యాఖ్యానించారు. ‘పీవోకే భారత్‌లో అంతర్భాగమంటే చూస్తూ ఊరుకోవడానికి పాక్‌ గాజులు తొడుక్కుని కూర్చోలేదు. వాళ్లేం బలహీనులు కాదు. పాక్‌ దగ్గరా అణుబాంబులున్నాయని గుర్తు చేశారు.
 
యుద్ధం గురించి ఆలోచించే ముందు ఇక్కడ మనుషులుగా బతగ్గలమా అని ఆలోచించాలి’ అంటూ ఫరూఖ్‌ అబ్దుల్లా అన్న మాటలు మంటలు రేపుతున్నాయి. ‘పీవోకే భారత్‌లో అంతర్భాగమని ఇంకా ఎంతకాలం చెబుతూ వస్తారు? 70 ఏళ్లు గడిచిపోయాయి. కానీ పీవోకేని భారత్‌ సొంతం చేసుకోలేకపోయింది. ముమ్మాటికీ పీవోకే పాకిస్థాన్‌లో అంతర్భాగమే’ అన్న ఫరూఖ్‌ మాటలు చర్చనీయాంశమయ్యాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కసాయి తండ్రి దారుణం.. కుమార్తెను వ్యభిచారంలోకి దించి...