వివాహం జరిగిన 18 రోజుల్లో మంగళసూత్రాన్ని తీసి పక్కనబెట్టి.. ఇంటి నుంచి పారిపోయింది ఓ నవ వధువు. అంతేగాకుండా తనను వెతకవద్దని.. ఇష్టం లేని పెళ్లి చేయడంతో తన భర్తతో కలిసి జీవించలేనని.. వాట్సాప్ వాయిస్ మెసేజ్ ద్వారా తెలియజేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ప్రేమపెళ్లిళ్లకు తల్లిదండ్రులు వ్యతిరేకిస్తున్నారు. తొందర తొందరగా వివాహం చేసేస్తున్నారు. అయితే ఇష్టం లేని పెళ్లి చేసుకుని హత్యలు చేస్తున్నారు. తాజాగా కన్యాకుమారి జిల్లాలో ఇష్టం లేని పెళ్లి చేశారని ఓ నవ వధువు మంగళసూత్రాన్ని తీసి పక్కనబెట్టి ఇంటి నుంచి పారిపోయింది.
కన్యాకుమారి జిల్లా, కులచ్చల్‌కు చెందిన 31 ఏళ్ల వ్యక్తి ఓ ప్రైవేట్ ఆఫీసులో పనిచేస్తున్నాడు. ఇతనికి తూత్తుకుడికి చెందిన 24 ఏళ్ల మహిళతో నవంబర్ 3వ తేదీన వివాహం జరిగింది.
వివాహం అనంతరం విందు కోసం బంధువుల ఇంటికి వెళ్తూ వచ్చిన వధూవరులు.. ఈ నెల 21వ తేదీ బయటికి వెళ్తానని చెప్పి ఇంటి నుంచి పారిపోయింది. భార్య కోసం భర్త పలు చోట్ల వెతికినా లాభం లేదు.
అయితే వాట్సాప్ మెసేజ్ ద్వారా తనకు ఇష్టం లేని పెళ్లి చేశారని స్పష్టం చేసింది. ఈ మెసేజ్‌లో భర్త వద్ద క్షమాపణలు కోరింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.