2008 ముంబై ఉగ్రవాద దాడుల్లో ప్రధాన నిందితులలో ఒకరైన తహవ్వూర్ రాణాను ప్రత్యేక జాతీయ దర్యాప్తు సంస్థ కోర్టు 18 రోజుల కస్టడీకి అప్పగించింది. అంతకుముందు రాత్రి ఎన్ఐఏ అధికారులు రాణాను ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఈ నిర్ణయం వెలువడింది.
ఎన్ఐఏ తరపున సీనియర్ న్యాయవాది దయాన్ కృష్ణన్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ నరేందర్ మాన్ కోర్టులో వాదనలు వినిపించారు. తహవూర్ రాణా తరపున, ఢిల్లీ లీగల్ సర్వీసెస్ అథారిటీ నుండి న్యాయవాది పియూష్ సచ్‌దేవా తన వాదనను వినిపించారు.
రాణాను 20 రోజుల కస్టడీ విచారణకు ఇవ్వాలని ఎన్ఐఏ కోరింది. ఇరువైపుల వాదనలు విన్న తర్వాత, ఎన్ఐఏ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి చంద్రజీత్ సింగ్ ఏజెన్సీకి 18 రోజుల కస్టడీని మంజూరు చేశారు. ప్రధానంగా 2008 ముంబై దాడుల వెనుక ఇతను కుట్ర కోణం ఉందని ప్రశ్నిస్తున్నారు. ఈ ముంబై ఉగ్రదాడిలో దాదాపు 166 మంది చనిపోగా 238 మందికి పైగా గాయపడ్డారు.
ఎన్నో రోజులుగా యూఎస్ ని రాణాను ఇండియాకి అప్పగించాలని కోరింది భారత్. ఎట్టకేలకు నిన్న యూఎస్ సుప్రీంకోర్టు అతడు అప్పీల్ ని రిజెక్ట్ చేయడంతో భారత్‌కి అప్పగించారు. ఇక తహవ్వూర్ రాణాకు సంబంధించిన ఫస్ట్ ఫోటో కూడా విడుదల చేశారు. అయితే ఆయన ఎన్‌ఐఏ అదుపులో ఉన్న ఫోటో వైరల్ అవుతుంది.