Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహారాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో పులుల భయం..ప్రజల్లో ఆందోళన

Advertiesment
Maharastra
Leopard
మహారాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో పులుల భయం ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్ధం కాకుండా సరిహద్దు గ్రామాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

జిల్లాలో రోజు రోజుకి పులుల సంచారం పెరుగుతుంది. అటు మావోయిస్టుల అలజడి కూడా జిల్లాలో ఆందోళన కలిగిస్తుంది. తాజాగా మెదక్ జిల్లాలో ఒక చిరుత పులి ఒక గ్రామానికి నిద్రలేకుండా చేస్తుంది.
 
వివరాల్లోకి వెళితే.. మెదక్ జిల్లా చిన్న శంకరం పేట మండలం కామారం తండాలో చిరుత సంచారం ఉంది. చిరుత పులి సంచారంతో భయాందోళనలో తండా వాసులు ఉన్నారు.

15 రోజుల్లో రెండు సార్లు దర్శనమిచ్చిన చిరుత పులి ఎప్పుడు ఎవరి మీద దాడి చేస్తుందోనని కంగారు పడుతున్నారు. చిరుతను పిల్లలను చూసామని అక్కడి తండా వాసులు చెప్తున్నారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో తగ్గుతున్న మరణాలు - దేశంలో పెరుగుతున్న కేసులు