మేనమామ కసాయిగా మారాడు. 13రోజుల పసికందును నీటి డ్రమ్ములో ముంచి హతమార్చాడు. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర లాతూర్ జిల్లా బుద్రుక్ గ్రామానికి చెందిన కృష్ణ షిండే సోదరి డెలివరీ కోసమని ఇటీవల తల్లిగారింటికి వచ్చింది.
15 రోజుల క్రితం ఆమెకు పండంటి ఆడబిడ్డ జన్మించగా దవాఖాన నుంచి డిశ్చార్జి చేసి ఇంటికి తీసుకొచ్చారు. అయితే శిశువు తరచూ ఏడుస్తుండడంతో విసుగు చెందిన 19 ఏళ్ల మేనమామ కృష్ణ.. సోమవారం ఉదయం చిన్నారిని నీటి డ్రమ్ములో వేసి పారిపోయాడు.
ఘటనా వివరాలు తెలుసుకున్న పోలీసులు కృష్ణ షిండేను అదుపులోకి తీసుకొని విచారించగా పాప తరచూ ఏడుస్తుండడంతో తన నిద్రకు భంగం కలిగిందని, అందుకే నీటిలో ముంచి చంపేశానని నేరం ఒప్పుకున్నాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.