'జై భీమ్.. అల్లాహ్ అక్బర్.. జై హింద్’... హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ప్రమాణం

మంగళవారం, 18 జూన్ 2019 (20:47 IST)
లోక్ సభలో మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీగా ప్రమాణం చేస్తున్న సమయంలో ఓ ఆసక్తికర పరిణామం జరిగింది. ఆయన ఎంపీగా ప్రమాణం చేసేందుకు పోడియం వద్దకు రాగానే కొందరు భాజపా ఎంపీలు ‘జై శ్రీరామ్’, ‘భారత్ మాతాకీ జై’ అంటూ నినాదాలు చేయడం మొదలుపెట్టారు. ప్రమాణం చేసేందుకు ముందుకు వచ్చిన అసదుద్దీన్ కూడా... అరవండి... అరవండి అంటూ చేతులతో సైగలు చేశారు. ఇది 17వ లోక్‌సభ సమావేశాల రెండో రోజైన మంగళవారం నాడు చోటుచేసుకుంది.
 
ఐతే అసదుద్దీన్ ప్రమాణం చేస్తూ... స్పీకర్ పోడియం ముందుకు వెళ్లి, వాళ్లను ఆపండి నేను ప్రమాణం చేస్తానని ప్రొటెం స్పీకర్‌కి విన్నవించారు. దీనితో హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి సహచర ఎంపీలను వారించడంతో వారు కాస్త నినాదాల హోరు తగ్గించారు. దానితో ఆయన తన ప్రమాణాన్ని పూర్తి చేశారు. ఐతే చివర్లో అసదుద్దీన్... ‘జై భీమ్.. అల్లాహ్ అక్బర్.. జై హింద్’ అంటూ పూర్తి చేశారు. ఇపుడా వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. మీరూ ఓ లుక్కేయండి.
 

When @asadowaisi comes for oath then suddenly MPs started sloganeering in the Parliament.

He gave it back with "Jai bheem,Jai Meem, Takbeer Allah hu Akbar, Jai Hind"

Savage

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం అధ్యక్షా... ఉన్నది నేనొక్కడినే.. కాస్త జాలి చూపండి అధ్యక్షా: జనసేన ఎమ్మెల్యే