Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పేటీఎం నగదుతో సమానంగా శక్తివంతమైనది... ఇప్పుడు 'ఇన్స్టంట్ బ్యాంక్ సెటిల్మెంట్’

Advertiesment
పేటీఎం నగదుతో సమానంగా శక్తివంతమైనది... ఇప్పుడు 'ఇన్స్టంట్ బ్యాంక్ సెటిల్మెంట్’
, గురువారం, 29 నవంబరు 2018 (19:42 IST)
న్యూఢిల్లీ: భారతదేశంలో నేడు అతిపెద్ద చెల్లింపుల వేదిక అయిన పేటీఎంను స్వంతంగా కలిగిన వన్97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ తన భాగస్వామ్య వ్యాపారుల కొరకు చెల్లింపుల పరిధిలో విప్లవాత్మక మార్పులు చేస్తూ, వ్యాపారుల కోసం ఇన్స్టంట్ బ్యాంక్ సెటిల్మెంట్ ఆవిష్కరణను ప్రకటించింది. ఈ ఆవిష్కరణతో, ఈ కంపెనీ, నగదుతో సమానంగా శక్తివంతమైన ఒక చెల్లింపు పరిష్కారాన్ని అందిచాలనే తన నిబద్ధతను తిరిగి నొక్కివక్కాణించింది, దీనితో వ్యాపారులకు, తమ రోజువారి క్యాష్-ఫ్లోల మెరుగుదల ద్వారా తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడంలో తోడ్పడుతోంది.

 
ఈ పరిష్కారంతో, ఈ కంపెనీ పేటీఎంకు ఆర్‌లను వారి ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో ఆమోదించు 9.8 మిలియన్‌కు పైగా భాగస్వామ్య వ్యాపారులకు లబ్ధి చేకూర్చే లక్ష్యం కలిగి ఉంది. నేడు, వినియోగదారులు, వ్యాపారులకు పేటీఎం క్యుఆర్ స్కాన్ చేయడం ద్వారా చెల్లిస్తున్నారు మరియు చెల్లింపుల అనుకూల పద్ధతులు అంటే పేటీఎం వాలెట్, భీమ్ యుపిఐ లేదా బ్యాంక్ ఖాతాల ద్వారా చెల్లిస్తున్నారు. మరియు “ఇన్స్టాంట్ బ్యాంక్ సెటిల్మెంట్” తో వ్యాపారులు తాము సేకరించిన చెల్లింపును సెటిల్ చేసుకోవడానికి తమకు అనుకూల సమయాన్ని ఎంచుకోవచ్చు లేదా వారు కోరుకున్నప్పుడు తమ బ్యాంక్ ఖాతాలలోనికి, తక్షణ సెటిల్మెంట్ కూడా చేసుకోవచ్చు. ఈ సదుపాయం వారికి అత్యంత సుళువైన ’పేటీఎం ఫార్ బిజినెస్’ ఆప్ పై అందుబాటులో ఉంటుంది, ఇందులో వ్యాపారులు తమ చెల్లింపులను మరియు సెటిల్మెంట్స్‌ను వాస్తవ సమయ ఆధారంగా ట్రాక్ చేసుకోవచ్చు.

 
ఈ కంపెనీ భారతదేశంలో 1 మిలియన్ పైగా వ్యాపారులతో ఒక పైలెట్ ప్రోగ్రామ్ నిర్వహించింది మరియు వారి నుండి అద్భుతమైన ప్రతిస్పందన అందుకుంది. ఇది ప్రస్తుతం 9.8 మిలియన్ ఆఫ్‌లైన్ వ్యాపారులను చేర్చుకోవాలనే ప్రక్రియలో ఉంది. ఈ సదుపాయంతో ఇప్పుడు మరింత మంది వ్యాపార భాగస్వాములు, వినియోగదారులకు పేటీఎం క్యుఆర్ గురించి తెలిపి మరియు దీనిని స్కాన్ చేయడం ద్వారా పేటీఎం వాలెట్, భీమ్ యుపిఐ లేదా బ్యాంక్ ఖాతాల ద్వారా చెల్లించాలని వారిని కోరుతున్నారని కూడా తెలిసింది.

 
కిరణ్ వాసిరెడ్డి, సిఓఓ-పేటీఎం ఇలా అన్నారు, “మా వ్యాపారులకు తమ రోజువారి క్యాష్ ఫ్లోలను నిర్వహించుటకు మరియు వారి వ్యక్తిగత మరియు వ్యాపార నగదు ఆవశ్యకతలను నిర్వహించుకోవడానికి లిక్విడిటీ అనేది చాలా ముఖ్యం. దానికి తగినట్లుగా, మేము ఇన్స్టంట్ సెటిల్మెంట్స్ అనే అంశాన్ని ఆవిష్కరించాము; ఇందులో వ్యాపారులు తాము సేకరించిన అన్ని చెల్లింపులను వాస్తవ సమయంలోనే నేరుగా తమ బ్యాంక్ ఖాతాలలో అందుకోవచ్చు. ఈ నూతన సదుపాయంతో ఆనందంగా ఉన్న వ్యాపారులు, “పేటీఎం ఇప్పుడు నగదుతో సమానంగా శక్తివంతమైనది” అని చెబుతున్నారు.”

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేసీఆర్ అంటే.. కావో కమిషన్ రావు : రాహుల్ సెటైర్లు