Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రైలు వెళ్లిపోయాక టిక్కెట్ కొన్నట్లుంది, కమల్ హాసన్ నిర్వేదం

Advertiesment
kamal haasan

ఐవీఆర్

, శనివారం, 22 ఫిబ్రవరి 2025 (21:35 IST)
కొన్ని పనులు చేయాల్సినప్పుడే చేయాలి. అప్పుడు కాకుండా ముందుగా చేసినా, లేదంటే ఆలస్యంగా చేసినా పరిస్థితి కమల్ హాసన్ మాదిరిగా వుంటుంది. ఇదేదో మనం చెప్పేది కాదు.. ఈ విషయం కమల్ హాసన్ గారే చెప్తున్నారు. తను రాజకీయ పార్టీ స్థాపన కనీసం 20 ఏళ్లకి ముందు చేసి వున్నట్లయితే తన పరిస్థితి వేరేగా వుండేదంటున్నారు. తన స్థాయి కూడా రాజకీయాల్లో మెరుగ్గా వుండేదని చెబుతున్నారు.
 
చేయాల్సినప్పుడు చేయకుండా ఆలస్యంగా రాజకీయ పార్టీ స్థాపించడం వల్లనే ఇలాంటి పరిస్థితి నెలకొని వుందన్నారు. అందుకే పెద్దలు చెబుతుంటారు... రైలు వెళ్లిపోయాక టిక్కెట్ కొన్నట్లుంది అనీ. ఏదేమైనప్పటికీ పార్టీ స్థాపించి 8 సంవత్సరాలు అయ్యిందనీ... ఇప్పుడిప్పుడే పుంజుకుంటోందనీ, త్వరలో మన వాణి పార్లమెంటులో వినబడబోతోందంటూ చెప్పారు. దీనితో కమల్ హాసన్‌ను డీఎంకె రాజ్యసభకు పంపుతుందన్న ఊహాగానాలకు మరింత బలం చేకూరినట్లయ్యింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

AP Assembly Sessions: ఫిబ్రవరి 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు.. జగన్ హాజరవుతారా?