హైదరాబాద్‌లోని శాంతినగర్ ప్రాంతంలోని మాసబ్ ట్యాంక్‌లోని అపార్ట్‌మెంట్ లిఫ్ట్‌లో చిక్కుకున్న ఆరేళ్ల బాలుడిని శుక్రవారం రక్షించారు. అయితే శనివారం ఆ బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆసుపత్రి వైద్యులు ఆ బాలుడు మృతి చెందినట్లు శనివారం నిర్ధారించారు.
వివరాల్లోకి వెళితే.. శుక్రవారం సాయంత్రం బాలుడు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మొదటి అంతస్తుల మధ్య చిక్కుకున్నాడు. అపార్ట్‌మెంట్ నివాసితులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, డీఆర్ఎఫ్ బృందం బాలుడిని బయటకు తీశారు.
బాలుడు గోడ మధ్యలో ఇరుక్కుపోయాడని.. అతనిని పైకి లేపడం జరిగిందని.. ఆ సమయంలో ఆ బాలుడు భయపడి.. తీవ్ర ఒత్తిడికి గురైనాడని పోలీసులు తెలిపారు. వెంటనే ఆ బాలుడిని ఆస్పత్రికి తరలించడం జరిగింది. కానీ ఆ బాలుడు శనివారం చికిత్స ఫలించక మృతి చెందాడు.