Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రూ.5 లక్షలు జీతమేగానీ రూ.2.75 లక్షల పన్ను చెల్లించాలి : రాష్ట్రపతి రాంనాథ్

రూ.5 లక్షలు జీతమేగానీ రూ.2.75 లక్షల పన్ను చెల్లించాలి : రాష్ట్రపతి రాంనాథ్
, సోమవారం, 28 జూన్ 2021 (18:34 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని త‌న సొంతూరి పర్యటనలో ఉన్న రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ పన్ను ఎగవేతదారులనుద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరూ పన్నులు విధిగా చెల్లించాలని కోరారు. తాను నెలకు రూ.5 లక్షల వేతనం తీసుకుంటున్నప్పటికీ.. రూ.2.75 లక్షల పన్ను చెల్లిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. 
 
మూడు రోజుల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ప్ర‌త్యేక రైలులో యూపీ వెళ్లిన రాష్ట్ర‌ప‌తి కోవింద్.. స్వ‌గ్రామం ప‌రౌంక్ గ్రామంలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ, ప్ర‌జ‌లంతా క‌ర్త‌వ్య‌దీక్ష‌తో ప‌న్నులు చెల్లించాల‌న్నారు. 
 
ప్ర‌స్తుతం దేశంలో అత్య‌ధిక జీతం అందుకుంటున్న వ్య‌క్తి రాష్ట్ర‌ప‌తి అని అంద‌రికీ తెలుసు అని, ప్ర‌తి నెలా రూ.2.75 ల‌క్ష‌లు నెల‌కు ట్యాక్స్ క‌డుతున్నాన‌న్నారు. ప్ర‌తి నెలా 5 ల‌క్ష‌ల జీతం వ‌స్తుంద‌ని అంద‌రూ అంటుంటార‌ని, కానీ దానికి కూడా ట్యాక్స్ ఉంటుంద‌ని తెలుసుకోవాల‌న్నారు. 
 
రాష్ట్ర‌ప‌తి కోవింద్‌ తాను ట్యాక్స్ క‌డుతున్న‌ట్లు చెప్ప‌గానే అక్క‌డ ఉన్న ప్ర‌జ‌లంతా చ‌ప్ప‌ట్లు కొట్టారు. తాను ఆదా చేసిన దాని క‌న్నా.. అధికారులు ఎక్కువ సంపాదిస్తార‌ని, ఇక్క‌డ ఉన్న టీచ‌ర్లు అంత క‌న్నా ఎక్కువ సంపాదిస్తున్నార‌న్నారు. 
 
ప‌న్నులు చెల్లించ‌డం వ‌ల్ల అభివృద్ధి జ‌రుగుతుంద‌న్న విష‌యాన్ని చెప్పేందుకు తాను ఇలా మాట్లాడుతున్న‌ట్లు రామ్‌నాథ్ తెలిపారు. సాధార‌ణ ప‌ల్లె పౌరుడు ఇలా దేశ అత్యున్న‌త ప‌ద‌విని అల‌క‌రిస్తార‌ని తానెప్పుడు అనుకోలేద‌ని, కానీ ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ వ‌ల్లే ఇది సాధ్య‌మైంద‌ని రామ్‌నాథ్ కోవింద్ తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాద్‌‌లో రాడార్‌ కన్ను: నేరగాళ్లకు ఇక సింహస్వప్నమే