కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన రైతు ఉద్యమం హింసాత్మక మలుపు తిరగడంతో ఇంటర్నెట్ సేవలపై విధించిన నిషేధాన్ని ఆదివారం సాయంత్రం 5 గంటల వరకూ పొడిగిస్తున్నట్టు హర్యానా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సమాచార ప్రజా సంబంధాల శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 16 జిల్లాల్లో ఈ నిషేధాజ్ఞలు కొనసాగనున్నాయి.
పబ్లిక్ ఆర్డర్‌కు ఎటువంటి అంతరాయం కలుగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. మంగళవారం నాడు సోనిపట్ ఝాజర్, పల్వాల్ జిల్లాల్లో ఈ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే శుక్రవారం నాడు ఈ ఆదేశాలను మరో 14 జిల్లాల్లో అమలు పరిచేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజాగా ఆదివారం కూడా ఈ నిషేధాజ్ఞలు కొనసాగుతాయంటూ ఆదేశాలు జారీ చేసింది.