పార్లమెంట్ ఉభయ సభల్లో విపక్ష పార్టీలకు చెందిన సభ్యులు రభస సృష్టిస్తూనే వున్నారు. దీంతో వర్షాకాల సమావేశాలు రసాభాసగా మారాయి. పట్టుమని పది నిమిషాలు కూడా సభా కార్యక్రమాలు సజావుగా సాగలేదు. విపక్ష పార్టీలు పదేపదే సభా కార్యక్రమాలకు అడ్డు తగలుగుతున్నారు. దీన్ని సభాపతి ఓం బిర్లా సీరియస్‌గా తీసుకున్నారు.
దేశాన్ని కుదిపేస్తున్న పెగాసస్ స్పైవేర్ అంశంతో పాటు వివాదాస్పద సాగు చట్టాల రద్దు వంటి అంశాలపై చర్చ చేపట్టాలని విపక్షాలు పట్టుడుతున్నాయి. కానీ, స్పీకర్ మాత్రం ఏమాత్రం స్పదించడం లేదు. చర్చకు ఆహ్వానించడం లేదు. దీంతో కొందరు ఎంపీలు పోడియం వద్దకు దూసుకెళ్లి నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ఓ దశలో కొందరు విపక్ష ఎంపీలు చైర్‌పైకి పేపర్లు విసిరేశారు. ఈ ఘటన పట్ల స్పీకర్ ఓం బిర్లా సీరియస్‌గా ఉన్నారు. పది మంది ఎంపీలపై ఆయన వేటు వేశారు. సస్పెన్షన్‌కు గురైన ఎంపీల్లో మానికం ఠాగూర్, డీన్ కురియకోజ్, హిబ్బి హిడన్, జోయిమని, రవనీత్ బిట్టు, గుర్జీత్ ఔజ్లా, ప్రతాపన్, వైద్యలింగం, సప్తగిరి శంకర్, ఏఎం ఆరిఫ్, దీపక్ బైజ్‌లు ఉన్నారు.
చైర్ పట్ల అవమానకరంగా ప్రవర్తించినందుకు రూల్ 374(2) ప్రకారం 10 మంది ఎంపీలకు సస్పెండ్ నోటీసులు జారీచేశారు. ఒకవేళ ఎవరైనా సభ్యులు భవిష్యత్తులో ఇలాగే ప్రవర్తిస్తే, వారిని లోక్‌సభ టర్మ్ మొత్తం బహిష్కరించనున్నట్లు స్పీకర్ బిర్లా గట్టిగా హెచ్చరించారు.