గ్లోబల్‌గా బంగారం ధరలు కదలకుండా అలానే ఉన్నా.. ఇండియాలో మాత్రం పెరుగుతున్నాయి. ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్ ధర 10 గ్రాములకు 0.11 శాతం పెరిగి రూ.38,926గా ఉంది.
ఇలా పెరగడం వరుసగా ఇది నాలుగో రోజు. ఈ నాలుగు రోజుల్లో గోల్డ్ ధర 10 గ్రాములకు రూ.1000 పెరిగింది. అయితే సిల్వర్ ధర మాత్రం కాస్త తగ్గింది. ఎంసీఎక్స్‌లో సిల్వర్ ఫ్యూచర్ ధర కేజీకి 0.2 శాతం తగ్గి రూ.46,740గా ఉంది. గత మూడు రోజుల్లో మాత్రం సిల్వర్ ధర కేజికి రూ.1,700 పెరిగింది.
గ్లోబల్‌గా స్పాట్ గోల్డ్ ధర 0.1 శాతం తగ్గి ఔన్స్‌కు 1,509.56 డాలర్లుగా ఉంది. సిల్వర్ ఒక ఔన్స్‌కు 17.88 డాలర్లుగా రికార్డైంది. అమెరికా–చైనా ట్రేడ్ వార్ నేపథ్యంలో, ఈఏడాది ప్రారంభం నుంచి గోల్డ్ ధరలు 18 శాతం పెరిగాయి.