Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గాంధీ శరీరాన్ని గాడ్సే చంపితే... ఆమె ఆత్మనే చంపేసింది : కైలాశ్ సత్యార్థి

గాంధీ శరీరాన్ని గాడ్సే చంపితే... ఆమె ఆత్మనే చంపేసింది : కైలాశ్ సత్యార్థి
, శనివారం, 18 మే 2019 (13:47 IST)
జాతిపిత గాంధీని చంపిన నాథూరామ్ గాడ్సే గొప్ప దేశభక్తుడంటూ బీజేపీకి చెందిన భోపాల్ లోక్‌సభ అభ్యర్థి సాధ్వీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇప్పటికే సొంత పార్టీ బీజేపీ నేతలతోపాటు విపక్షాలు కూడా ఆమె వ్యాఖ్యలపై మండిపడుతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో నోబెల్ బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్థి కూడా సాధ్వీ ప్రజ్ఞాసింగ్ వ్యాఖ్యలను ఖండించారు. గాంధీ శరీరాన్ని మాత్రమే గాడ్సే హత్య చేశాడు. కానీ  ప్రజ్ఞాసింగ్‌ వంటి వాళ్లు గాంధీ ఆత్మను, దానితో పాటు అహింస, శాంతి, సహనాలను చంపేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం ఆయన  ట్విట్టర్‌లో ఘాటుగా స్పందించారు. చిన్న చిన్న స్వలాభాల కోసం బీజేపీ నాయకత్వం తాపత్రయ పడుతోందని మండిపడ్డారు. తక్షణమే ఆమెను బీజేపీ పార్టీ నుంచి బహిష్కరించాలంటూ ట్వీట్‌ చేశారు. 
 
నిజానికి మాలేగావ్‌లో జరిగిన బాంబు పేలుళ్ళ కేసులో సాధ్వీ ప్రజ్ఞా సింగ్ ఓ నిందితురాలు. ఆమెకు బీజేపీ టిక్కెట్ ఇచ్చి భోపాల్ అభ్యర్థిగా బరిలోకి దించింది. అపుడే పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. ఇపుడు గాంధీని హత్య చేసిన గాడ్సే దేశభ​క్తుడని వ్యాఖ్యానించడం పెద్ద దుమారాన్నే రేపింది. స్వతంత్ర భారతావనిలో తొలి హిందూ తీవ్రవాది గాడ్సే అంటూ సినీహీరో రాజకీయ నాయకుడు కమల్ హాసన్ వ్యాఖ్యానించారు. దీనికి ప్రతిగా ఆమె కౌంటర్ ఇచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మూతపడిన ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్.. ఎందుకంటే...