Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉచిత హామీలకు అయ్యే ఖర్చు నిధులు ఎక్కడ నుంచి తెస్తారు : పార్టీలకు ఈసీ ప్రశ్న

election commission of india
, బుధవారం, 5 అక్టోబరు 2022 (09:34 IST)
దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు అధికారమే పరమార్థంగా పని చేస్తున్నాయి. అధికారం కోసం ఎన్ని అబద్ధాలైనా చెప్పేందుకు ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఓటర్లను ఆకర్షించేందుకు ఇష్టానుసారంగా ఉచితాలను ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఉచితాల వ్యవహారంపై భారత ఎన్నికల సంఘం దృష్టిసారించింది. 
 
ఉచితాలకు అయ్యే ఖర్చును, అందుకు అవసరమయ్యే నిధులను ఎక్కడి నుంచి తెస్తారన్న విషయాలను కూడా రాజకీయ పార్టీలు ప్రజలు వివరించాలని ఈసీ స్పష్టం చేసింది. తద్వారా ఉచితాలకు ఆయా పార్టీలు నెరవేర్చగలవా లేదా అనే అంశంపై ఓటర్లకు ఓ అభిప్రాయం ఏర్పడుతుందని పేర్కొంది. 
 
అయితే, ఈ ఉచితాలు లేదా సంక్షేమ పథకాలకు చట్టబద్ధ నిర్వచనం అంటూ ఏదీ లేదన్నది వాస్తవం అనీ అభిప్రాయపడింది. సుప్రీంకోర్టులో ఈ ఉచితాలపై విచారణ జరుగుతున్నప్పటికీ తగిన స్పష్టత లేదని పేర్కొంది. 
 
ఈ క్రమంలో, రాజకీయ పార్టీలే తాము ఫలానా థకం ఏ కారణంతో ఇస్తున్నారో వాటికి నిధులు ఎక్కడన నుంచి తీసుకువస్తారో కూడా చెప్పాలని ఎన్నికల సంఘం కోరింది. కాగా, ఇలాంటి హామీలు ఇవ్వకుండా రాజకీయ పార్టీలను అడ్డుకోలేమని, అందుకే ఆయా ఉచితాలకు సంబంధించిన వివరాలను తెలుసుకోవడం తమ హక్కుగా ఓటర్లను భావించాలని సూచించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉత్తరాఖండ్‌లో ఘోరం.. పెళ్లి బృందం బస్సు బోల్తా - 25 మంది మృతి