భారత రక్షణ శాఖ మరో అరుదైన ఫీట్‌ను సాధించింది. తొలి స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్, ఇండియన్ నేవీ అంబులపొదిలో చేరేందుకు సిద్ధమవుతుంది. ఈ భారీ విమాన వాహక నౌక తొలి సముద్ర పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి.
మొత్తం 860 మీటర్ల పొడవు, 203 మీటర్ల వెడల్పు, 45 వేల మెట్రిక్ టన్నుల బరువున్న స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌ను ఇండియన్ నేవీకి చెందిన నావల్ డిజైన్ డైరెక్టరేట్ రూపొందించింది. దీంతో విమాన వాహక నౌకల తయారీ, రూపకల్పన దేశాల సరసన భారత్ చేరినట్లయ్యింది.
కాగా, ఐఎస్‌ఎస్ విక్రాంత్ తొలి సముద్ర పరీక్షలు దేశం గర్వించదగిన చారిత్రక ఘట్టంగా భారత నౌకాదళం అభివర్ణించింది. 1971 యుద్ధంలో కీలక పాత్ర పోషించిన భారత తొలి విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్‌కు 2014లో వీడ్కోలు పలికారు.
కాగా, 1971 ఇండో-పాక్ యుద్ధంలో భారత్ విజయం సాధించి 50 ఏండ్లకు తొలి స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ పునర్జన్మ పొందినట్లు నేవీ ట్వీట్ చేసింది.