తనపై దాడి జరుగుతోందని అయితే, తాను మాత్రం దాన్ని ఎంజాయ్ చేస్తున్నట్టు కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. గతంలో జర్నలిస్టు గౌరీ శంకర్ హత్య కేసులో రాహుల్ ఆర్ఎస్ఎస్ - బీజేపీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆర్ఎస్ఎస్ ఆయనపై పరువు నష్టందావా కేసును నమోదు చేసింది.
ఈ కేసు విచారణ కోసం ఆయన గురువారం ముంబై కోర్టుకు హాజరయ్యారు. కేసు విచారణ తర్వాత 15 వేల రూపాయల వ్యక్తిగత పూచీకత్తుపై రాహుల్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత కోర్టు హాలు నుంచి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ, తనపై దాడి జరుగుతోందన్నారు.
అితే, ఈ పోరాటాన్ని తాను ఎంజాయ్ చేస్తున్నట్టు చెప్పారు. ముఖఅయంగా, తనది సిద్ధాంతాలతో కూడిన పోరాటమన్నారు. పేదలు, రైతులకు అండగా తాను ఉంటానని, గత ఐదేళ్ళలో తాను చేసిన పోరాటం కంటే ఇకపై పది రెట్లు ఎక్కువగా పోరాడుతానని చెప్పారు.