Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌కి కోర్టు షాక్

Advertiesment
Kangana Ranaut
, బుధవారం, 26 జూన్ 2019 (14:54 IST)
సోషల్ మీడియాల పుణ్యమా అని ఎవరిపై అయినా నిరాధారంగా వ్యాఖ్యలు చేసేస్తూంటే... ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో చవి చూడబోతున్నారు ఈ బాలీవుడ్ హీరోయిన్, ఆవిడ సోదరీమణులు. 
 
వివరాలలోకి వెళ్తే... ఈ మధ్య కాలంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్. ఆవిడగారి సోదరి రంగోలీ చండేల్‌లు సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. అందులోనూ బాలీవుడ్ స్టార్స్‌పై రంగోలీ చేస్తున్న సోషల్ మీడియా పోస్ట్‌లయితే పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. 
 
కాగా... గతంలో వీరు చేసిన వ్యాఖ్యల కారణంగా పరువు పోయిందంటూ నటుడు ఆదిత్య పంచోలి, ఆయన భార్య జరీనాలు పరువు నష్టం దావా వేయడం జరిగింది. ఈ కేసు విచారణలో భాగంగా కంగనా సిస్టర్స్‌ను స్వయంగా కోర్టుకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ అయ్యాయి.
 
కేసు వివరాలలోకి వెళ్తే... తన కెరీర్ ఆరంభంలో ఆదిత్య పంచోలి తనను గృహ నిర్బంధం చేసాడంటూ కంగనా ఒక ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆవిడ సోదరి రంగోలీ కూడా కంగనా వ్యాఖ్యలను సమర్ధిస్తూ సోషల్ మీడియా ద్వారా తన సోదరిని ఆదిత్య రేప్ కూడా చేసాడనీ... తాము అప్పట్లోనే కేసు పెట్టామనీ.. ఎఫ్ఐఆర్ కూడా నమోదు అయ్యిందంటూ పేర్కొన్నారు. అయితే ఆదిత్య పంచోలి మాత్రం తనపై ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదనీ.. వారు చేస్తున్నవన్నీ కూడా నిరాధారమైన ఆరోపణలు అంటూ వాదిస్తూ వస్తున్నారు.
 
ఈ నేపథ్యంలో తన పరువు పోయేలా పదేపదే తనను టార్గెట్ చేస్తూ వస్తున్న విమర్శల కారణంగా తన పరువుకు భంగం వాటిల్లిందంటూ ఆదిత్య కోర్టుకు వెళ్లాడు. కాగా, ఇప్పటివరకు కంగనా సిస్టర్స్ తరపున వారి న్యాయవాది కేసు వాయిదాలకు హాజరు అవుతూ వచ్చాడు. ఈసారి తప్పనిసరిగా కోర్టు విచారణకు కంగనా సిస్టర్స్ రావాల్సిందే అంటూ కోర్టు ఆదేశించింది. దాంతో ఈ స్టార్ హీరోయిన్ సిస్టర్స్ కోర్ట్‌కి వెళ్లక తప్పేలా లేదు. ఒకవేళ ఈ కేసులో కంగనా సిస్టర్స్ ఓడిపోతే ఆదిత్యకు భారీ మొత్తంలో నష్టపరిహారాన్ని చెల్లించాల్సి ఉంటుందనే టాక్ ప్రస్తుతం బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. మరి ఇకనైనా ఈ సిస్టర్స్ నోటికి తాళం పడుతుందో లేదో... అదీ చూద్దాం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హ‌రీష్ శంక‌ర్ మ‌న‌సును క‌దిలించిన సినిమా... ఇంత‌కీ అది ఏ సినిమా..?