Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
सोमवार, 23 दिसंबर 2024
webdunia
Advertiesment

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రజ్వల్ వీడియోలు : సస్పెండ్ చేసిన జేడీఎస్

Prajwal Revanna

వరుణ్

, మంగళవారం, 30 ఏప్రియల్ 2024 (17:31 IST)
మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ శృంగార వీడియోల స్కామ్ ఇపుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎంతో మంది మహిళలను ఆయన లైంగికంగా వేధిస్తున్న వీడియోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వందలాది మహిళలతో ఉన్న అశ్లీల వీడియోలను ప్రజ్వల్ స్వయంగా వీడియోలు తీసినట్టు తెలుస్తుంది. ప్రజ్వల్‌‌పై ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ వ్యవహారంలో వెలుగులోకి వచ్చింది. 
 
ముఖ్యంగా గత 2019-22 మధ్యకాలంలో ప్రజ్వల్ తనను ఎన్నోసార్లు లైంగిక వేధింపులకు గురిచేశారని ఓ మహిళ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన కుమార్తెను సైతం వదిలిపెట్టలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఇదే సమయంలో ప్రజ్వల్ తండ్రి రేవణ్ణపై కూడా ఆమె ఆరోపణలు చేశారు. రేవణ్ణ భార్య ఇంట్లో లేని సమయంలో తన పట్ల అసభ్యంగా ప్రవర్తించేవారని ఆరోపించారు. 
 
కాగా, ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో ప్రజ్వల్ రేవణ్ణ హాసన్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. గతంలో ఈ స్థానం నుంచి మాజీ ప్రధాని దేవెగౌడ నాయకత్వం వహించారు. రేవణ్ణ ప్రస్తుతం హోలెనరసిపూర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మరోవైపు ఈ సెక్స్ వీడియోలు వెలుగులోకి రావడంతో 33 యేళ్ళ ప్రజ్వల్ రేవణ్ణ దేశం విడిచి జర్మనీకి పారిపోయాడు. దీంతో ఈ కేసును దర్యాప్తు చేసేందుకు వీలుగా కర్నాటక ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో జేడీఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజ్వల్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ముఖ్యాంశాలు ఇవే..