Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Karnataka Assembly Election Exit Poll 2023 Result, మళ్లీ హంగ్ తప్పదా?

Advertiesment
Karnataka Exit Poll
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. దీనితో ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడ్డాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో బీజేపీ- కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ పోటీ సాగినట్లు తెలుస్తోంది. 2018 ఏడాది మాదిరిగా ఏ పార్టీ కూడా మెజారిటీ సాధించడానికి సగం మార్కును దాటే పరిస్థితి కనబడలేదు. దీంతో రాష్ట్రంలో జేడీ(ఎస్) వరుసగా రెండోసారి కింగ్‌మేకర్‌గా అవతరించే అవకాశం కనబడుతోంది.
 
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని బలమైన ప్రచారంతో ఉత్సాహంగా ఉన్న బీజేపీ మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తుండగా, ఈ అసెంబ్లీ ఎన్నికలలో బలమైన పునరాగమనం చేయాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది. న్యూస్ నేషన్ సిజిఎస్ అంచనా ప్రకారం కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 224 సీట్లకు గాను భాజపాకి 114, కాంగ్రెస్ 86, జెడీఎస్ 21, ఇతరులు 3 చోట్ల విజయం సాధిస్తారు. రిపబ్లిక్ టీవీ ప్రకారం భాజపాకి 85-100 స్థానాలు, కాంగ్రెస్ పార్టీకి 94-108 స్థానాలు, జేడీఎస్ 24-32 స్థానాలు, ఇతరులు 2-4 స్థానాల్లో గెలుస్తారని అంచనా వేసింది. మొత్తమ్మీద జేడీఎస్ కింగ్ మేకర్ అని అన్ని ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ల్యాప్‌టాప్‌లో వర్క్ చేసిన మహిళ.. వీడియో వైరల్