Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కర్నాటకలో హస్తం హవా - లోక్‌పోల్ సర్వేలో వెల్లడి

bjp - congress
, సోమవారం, 8 మే 2023 (11:14 IST)
ఈ నెల పదో తేదీన కర్నాటక అసెంబ్లీకి ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని అనేక సర్వేలు వెల్లడిస్తున్నాయి. తాజాగా లోక్‌పాల్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలోనూ కాంగ్రెస్ పార్టీ గెలుపు తథ్యమని తేల్చింది. ఆ పార్టీకి 129 నుంచి 134 మేరకు సీట్లు వస్తాయన వెల్లడించింది. ఈ ఎన్నికల్లో అధికార బీజేపీ నేతలపై అవినీతి ఆరోపణలు బాగానే వచ్చాయి. ముఖ్యంగా, 40 శాతం కమిషన్ సర్కారు అనే పేరువచ్చింది. దీంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది. 
 
ఈ నేపథ్యంలో పదో తేదీన జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ 129 నుంచి 134 సీట్లలో విజయం సాధించే అవకాశం ఉందని తెలిపింది. ఆ పార్టీకి 42-45 శాతం ఓట్లను తన ఖాతాలో వేసుకుంటుందని అంచనా వేసింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ 50 నుంచి 65 సీట్లకే పరిమితం కావొచ్చని తెలిపింది. గత ఎన్నికల్లో 36 శాతం ఓట్లు సాధించిన కమలదళానికి ఈసారి 31-32 శాతం ఓట్లు మాత్రమే వస్తాయని వెల్లడించింది.
 
ఇక జేడీఎస్ ఈసారి 23 నుంచి 28 స్థానాల్లో గెలుస్తుందని, ఈ పార్టీకి 14-18 శాతం ఓట్లు వస్తాయని వెల్లడించింది. ఇక ఇతరులు 5 నుంచి 8 శాతం ఓట్ల శాతంతో 0-2 స్థానాలు సాధించే అవకాశం ఉందని సర్వే నివేదిక తెలిపింది. కర్ణాటకలో మొత్తం 224 సీట్లు ఉండగా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 113 సీట్లు అవసరం. ఈ మ్యాజిక్ మార్కును కాంగ్రెస్ సింగిల్‌గానే సంపాదించుకుంటుందని అన్ని ముందస్తు సర్వేలు వెల్లడిస్తున్నాయి. మరి ఓటరు తీర్పు ఎలా ఉంటుందో చూడాలంటే మే 15వ తేదీ వరకు వేచి ఉండక తప్పదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డెలివరీ బాయ్ బైక్ ఎక్కిన రాహుల్ గాంధీ