Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎర్రకోట కారు బాంబు పేలుడు కేసు: డాక్టర్ ఉమర్ నబీ ఇల్లు కూల్చివేత

Advertiesment
umar un nabi

ఠాగూర్

, శుక్రవారం, 14 నవంబరు 2025 (15:42 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఉగ్రవాదంపై భద్రతా బలగాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. పుల్వామా జిల్లాలో శుక్రవారం చేపట్టిన కీలక ఆపరేషన్‌లో ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబు పేలుళ్ల కేసులో కీలక నిందితుడైన డాక్టర్ ఉమర్ నబీకి చెందిన ఇంటిని పేలుడు పదార్థాలతో ధ్వంసం చేసారు. ఉగ్రవాద కార్యకలాపాలకు ఈ ఇల్లు అడ్డాగా మారిందన్న పక్కా సమాచారంతో భద్రతా బలగాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.
 
పుల్వామాకు చెందిన ఉమర్ నబీ గతంలో ఢిల్లీలో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో ప్రధాన సూత్రధారిగా ఉన్నాడు. అప్పటి నుంచి పరారీలో ఉన్న అతడు, కాశ్మీర్ లోయలో ఉగ్రవాద వ్యవస్థను నడుపుతున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. అతడి ఇంటిని ఉగ్రవాదులు ఆశ్రయం కోసం, ఆయుధాలు దాచేందుకు ఉపయోగిస్తున్నట్లు నిర్ధారించుకున్న తర్వాత భద్రతా బలగాలు ఈ ఆపరేషన్‌ను చేపట్టాయి.
 
ఈ ఆపరేషన్ కోసం ముందుగా ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నాయి. స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించి, పటిష్టమైన భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశాయి. అనంతరం, నియంత్రిత పేలుడు పదార్థాలను ఉపయోగించి ఇంటిని పూర్తిగా నేలమట్టం చేశాయి. ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా ఆపరేషను పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.
 
ఈ ఘటనతో కాశ్మీర్‌లోని ఉగ్రవాద శ్రేణులకు గట్టి హెచ్చరిక పంపినట్లయిందని ఓ సీనియర్ అధికారి పేర్కొన్నారు. ఉగ్రవాదులకు, వారికి సహకరిస్తున్న వారికి ఇకపై స్థానం లేదని స్పష్టం చేసేందుకే ఇలాంటి చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. ఈ కూల్చివేత అనంతరం పుల్వామా జిల్లా వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేసి, తనిఖీలను ముమ్మరం చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అక్రమ సంబంధం ఉందనీ.. అందరూ చూస్తుండగా పట్టపగలు భార్య గొంతు కోసి చంపేసిన భర్త