అరేబియా సముద్రంలో ఏర్పడిన అత్యంత తీవ్ర తుఫాను బిపర్జోయ్ తుఫాను గుజరాత్ తీరాన్ని తాకింది. పాకిస్థాన్ దేశంలోని కరాచీ, గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లాలోని మాండ్వీ మధ్య తీరాన్ని దాటుతోంది. అత్యంత తీవ్ర తుఫాను బలపడిన బిపోర్జాయ్ తుఫాు పూర్తిగా భూభాగం పైకి చేరేందుకు ఈ అర్థరాత్రి సమయం పడుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
తుఫాను ప్రభావంతో గంటకు 150 కిలోమీటర్ల వేగంతో గాలుుల వీస్తాయని ఐఎండీ పేర్కొంది. ఇప్పటికే తుఫాను ప్రభావిత ప్రాంతాల నుంచి 94 వేల మందిన ఖాళీ చేయించారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలు పరిస్థితిని ఎప్పటికపుడు సమీక్షిస్తున్నారు. అలాగే, ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ బృందాలను పెద్ద సంఖ్యలో మొహరించి సహాయక చర్యలను వేగవంతం చేశారు.