Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ల్యాబ్‌లో అభివృద్ధి చేసిన వజ్రాలకు పెరుగుతున్న ప్రజాదరణ, ఎందుకలా?

Daimond
, గురువారం, 15 జూన్ 2023 (23:28 IST)
ల్యాబ్‌లో అభివృద్ధి చేసిన వజ్రాలు ప్రధానంగా గనుల్లో వెలికి తీసిన వజ్రాలతో సమానంగా ఉన్నందున ప్రజాదరణ పొందుతున్నాయి. అవి పూర్తిగా వాస్తవమైనవి, భూమికి దిగువన జరిగే వజ్రాల సృష్టి ప్రక్రియను సరిగ్గా ప్రతిబింబించడం ద్వారా ల్యాబ్‌లలో అభివృద్ధి చేయబడతాయి. ఫలితంగా అవి ఘనులలో తీసిన వజ్రం వలె ఖచ్చితమైన కార్బన్ కూర్పు, రసాయన, ఉష్ణ- భౌతిక లక్షణాలను కలిగి ఉంటాయి. ఇది టెస్ట్-ట్యూబ్ బేబీస్ మరియు సహజంగా జన్మించిన శిశువుల నేపథ్యంను పోలి ఉంటుంది, ఇక్కడ ప్రక్రియ భిన్నంగా ఉంటుంది కానీ ఫలితం మాత్రం సరిగ్గా ఒకే విధంగా ఉంటుంది. అదేవిధంగా, ప్రయోగశాలలో పెరిగిన వజ్రాలు ఘనులలో తీసిన వజ్రాలతో సమానంగా ఉంటాయి. వివిధ పరిమాణాలు, నాణ్యతలలో కూడా అభివృద్ధి చేయబడతాయి. అందువల్ల అదే 4Cలను కూడా కలిగి ఉంటాయి- అదే కట్, రంగు, స్పష్టత, క్యారెట్.
 
ప్రయోగశాలలో అభివృద్ధి చేసిన వజ్రాలు... 
ప్రయోగశాలలో అభివృద్ధి చేసిన వజ్రం యొక్క అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే అవి తవ్వబడనందున పర్యావరణానికి మంచివి. అవి భూమిలో ఏవిధంగా ఏర్పడతాయో సరిగ్గా అదే పద్ధతిలో ల్యాబ్‌లలో పైన అభివృద్ధి చ్చేయబడతాయి. వజ్రాలను వెలికితీసేందుకు భూమికి దిగువన 150 కిలోమీటర్లు త్రవ్వడం అవసరం లేదు. తత్ఫలితంగా, మైనింగ్‌తో సంబంధం ఉన్న భూమి, నీటి నిల్వల భారీ విధ్వంసంపై ప్రభావాన్ని ఇది ఆదా ఆపుతుంది. అంతేకాకుండా, విద్యుత్తును వినియోగించే అనేక ల్యాబ్‌లు పునరుత్పాదక వనరులకు లేదా అదనపు స్థిరమైన ప్రయోజనాలకు మారడం ప్రారంభించాయి.
 
ల్యాబ్‌లో అభివృద్ధి చేసిన 1 క్యారెట్ వజ్రం, 250 టన్నుల భూమిని మరియు 109 గ్యాలన్ల నీటిని ఆదా చేయగలదని నివేదికలు సూచిస్తున్నాయి. నేడు, ప్రపంచం 100 మిలియన్ క్యారెట్లకు పైగా తవ్విన వజ్రాలను వినియోగిస్తుంది, కాబట్టి వజ్రాల తవ్వకం వల్ల కలిగే నష్టాన్ని, ల్యాబ్‌లో అభివృద్ధి చేసిన వజ్రాలను ఎంచుకోవడం ద్వారా ఒకరు చేసే పొదుపును మాత్రమే ఊహించవచ్చు. ఇక్కడ వినియోగదారు నాణ్యతపై అస్సలు రాజీపడరు. కానీ అదే సమయంలో భూమి పర్యావరణం, దాని ప్రజలను సైతం కాపాడుతుంది.
 
అంతేకాకుండా, ప్రయోగశాలలో అభివృద్ధి చేసిన వజ్రాలు తవ్వబడనందున, అవి మైనింగ్ ఖర్చులను కూడా ఆదా చేస్తాయి. వినియోగదారులు, గనులలో తీసిన తవ్విన వజ్రాన్ని కొనుగోలు చేయడానికి చెల్లించే ఖర్చులో ఎక్కువ భాగం మైనింగ్, భూమి దిగువ నుండి వెలికితీయడానికి అయ్యే ఖర్చు ఉంటుంది. ల్యాబ్‌లో అభివృద్ధి చేసిన డైమండ్ టెక్నాలజీలో ఈ మైనింగ్ ఖర్చు ఆదా అవుతుంది. ఈ పొదుపు వినియోగదారునికి ప్రయోజనంగా బదిలీ చేయబడుతుంది. ఫలితంగా, ల్యాబ్‌లో అభివృద్ధి చేసిన వజ్రాలు తవ్విన వజ్రాల కంటే కనీసం 50% చౌకగా ఉంటాయి.
 
ల్యాబ్‌లో అభివృద్ధి చేసిన వజ్రాలు పునఃవిక్రయం విలువను కలిగి ఉంటాయి
ప్రయోగశాలలో అభివృద్ధి చేసిన వజ్రాలు గనులలో తీసిన వజ్రాల వలె పెట్టుబడి విభాగంలో చూడవచ్చు. లైమ్‌లైట్ డైమండ్స్ వంటి బ్రాండ్‌లు 80% బైబ్యాక్ మరియు 100% ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను మార్కెట్‌లోని ఏదైనా విలువైన జెమ్ స్టోన్‌పై అందించే అదే పునఃవిక్రయ అవకాశాలను అందించడమే దీనికి ప్రధాన కారణం. దీనికి తోడు, వజ్రాల ఆభరణాల పట్ల అవగాహన మరియు వజ్రాభరణాల కొనుగోలు కోసం వినియోగదారుల ప్రాధాన్యతలు భారతదేశంలో వేగంగా మారుతున్నాయి. పెట్టుబడుల కంటే, ఇప్పుడు ప్రాధాన్యత ఆభరణాల రూపకల్పన మరియు సౌందర్య విలువల వైపు మొగ్గు చూపుతోంది.
 
సాలిటైర్ వజ్రం కల వాస్తవిక రూపం దాల్చింది...!
ల్యాబ్‌లో అభివృద్ధి చేసిన వజ్రాలు గనులలో తీసిన వజ్రం కంటే దాదాపు 60-70% చౌకగా ఉంటాయి కాబట్టి, వినియోగదారులు అదే పరిమాణంలో గనులలో తీసిన వజ్రం కంటే చాలా పెద్ద రాయిని ఎంపిక చేయడం ప్రారంభించారు. ఈ డిమాండ్‌కు అనుగుణంగా, ప్రఖ్యాత రిటైలర్ శ్రీ జగదాంబ జ్యువెల్స్ తమ వినియోగదారుల కోసం మూడు రోజుల ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేయనుంది. ఈ ఎగ్జిబిషన్ వారి స్టోర్ కౌంటర్‌లో ల్యాబ్‌లో అభివృద్ధి చేసిన CVD డైమండ్ పొదిగిన ఆభరణాల యొక్క అద్భుతమైన సేకరణను ప్రదర్శిస్తుంది. ఈ పర్యావరణ వజ్రాలను భారతదేశపు అతిపెద్ద,  స్థిరమైన లగ్జరీ బ్రాండ్ అయిన లైమ్‌లైట్ డైమండ్స్ అందిస్తుంది. ఎగ్జిబిషన్ జూన్ 16 నుండి 18 వరకు గోకుల్ ప్లాజా, గచ్చిబౌలి రోడ్, హైదరాబాద్‌లో జరుగుతుంది.
 
ల్యాబ్‌లో అభివృద్ధి చేసిన వజ్రాల జనాదరణ గురించి శ్రీ జగదాంబ జ్యువెల్స్ వ్యవస్థాపకుడు అవినాష్ అగర్వాల్ మాట్లాడుతూ, “ఈ రోజుల్లో వినియోగదారులలో ల్యాబ్‌లో పెరిగిన వజ్రాల గురించి అవగాహన పెరుగుతోంది. వారు తమ కస్టమర్‌లకు, పూర్తిగా అవగాహన కల్పించే పారదర్శకమైన బ్రాండ్‌లను ఎంచుకుంటున్నారు. అందుకే మేము మా కస్టమర్‌లకు లైమ్‌లైట్ డైమండ్స్ చేత తయారుచేయబడిన ప్రపంచ శ్రేణి ల్యాబ్‌లో అభివృద్ధి చేసిన వజ్రాలతో తీర్చిదిద్దిన  ఆభరణాలలో ఉత్తమమైన వాటిని ఎందుకు అందించకూడదని అనుకున్నాము. ల్యాబ్‌లో అభివృద్ధి చేసిన వజ్రాలు రేపటి యువతకు గుర్తింపు అని మేము నమ్ముతున్నాము" అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మైక్రోమొబిలిటీ యూరోప్ 2023లో NEV కేటగిరీలో వింగ్స్ EV మైక్రోకార్ ‘రాబిన్’ ఉత్తమ ర్యాంక్ పొందింది