Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తప్పుడు కేసు పెడతారా.. తల్లికూతుళ్లకు కోర్టులో చుక్కెదురు

Advertiesment
court

సెల్వి

, శుక్రవారం, 27 సెప్టెంబరు 2024 (18:38 IST)
తప్పుడు కేసు పెట్టిన తల్లికూతుళ్లకు కోల్‌కతా కోర్టులో చుక్కెదురైంది. కూతురుపై అత్యాచారం జరిగందని ఓ మహిళ ఏడాది క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ముగ్గురిపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఏడాది పాటు ఆ ముగ్గురు జ్యూడిషియల్ రిమాండ్‌లో మగ్గుతున్నారు. 
 
అయితే ఈ కేసులో బెయిల్ కోరుతూ ఆ ముగ్గురు కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించారు. ఇక బెయిల్ విచారణ సందర్భంగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా నిందితులపై తప్పుడు కేసు పెట్టినట్లు సదరు మహిళ అంగీకరించడంతో కథ రివర్స్ తిరిగింది. కోల్‌కతా కోర్టు తల్లీకూతుళ్లపై విచారణ జరపాలని ఆదేశించింది. ఆ తల్లీకూతుళ్లపై విచారణ చేపట్టాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది. 
 
ఇంతకీ ఏం జరిగిందంటే? తన భర్తకు ప్రమాదంలో వెన్నుపూస విరగడంతో కుటుంబ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని.. స్థానిక రాజకీయ నాయకులు కూతురిపై అత్యాచారం జరిగినట్లు తప్పుడు కేసు పెడితే ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పారని.. వారి మాటలను నమ్మి ఈ పని చేసినట్లు బాధితురాలు కోర్టుకు చెప్పింది. 
 
ఇది విన్న ధర్మాసనం.. ఆశ్చర్యం వ్యక్తం చేయడంతో పాటు నిందితులకు తక్షణ బెయిల్ మంజూరు చేసింది. అలాగే ఆ ముగ్గురిపై కేసును కొట్టేయాలని ట్రయల్ కోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. అమాయకులపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఆర్థికంగా ఎదగడం సాధ్యమా అని కోర్టు ప్రశ్నించింది. ఇంకా తప్పుడు కేసు పెట్టి కల్పిత సాక్ష్యాలు అందించిన మహిళలపై విచారణ జరిపించాలని ట్రయల్ కోర్టుకు కీలక ఆదేశాలు జారీ చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్ కల్యాణ్ పైన ప్రకాష్ రాజ్ సెటైర్లు వేస్తుంటే కృష్ణవంశీ ఏమన్నారో తెలుసా?