Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

12 ఏళ్ల బాలుడు రైలు ప్రమాదాన్ని అడ్డుకున్నాడు.. ఎలా?

railway track
, మంగళవారం, 26 సెప్టెంబరు 2023 (10:34 IST)
12 ఏళ్ల బాలుడు రైలు ప్రమాదాన్ని అడ్డుకున్నాడు. ఢిల్లీలోని మాల్డా జిల్లాలో పెను రైలు ప్రమాదం ఓ బాలుడి చర్య వల్ల తప్పింది. తాను వేసుకున్న ఎరుపు చొక్కాను ఊపి రైలును ఆ బాలుడు ఆపడం ద్వారా పట్టాలు డామేజ్ కావడంతో ఏర్పడాల్సిన భారీ రైలు ప్రమాదం తప్పింది. లోకో పైలట్ ముర్సలిన్ సేఖ్ ​​సిగ్నల్ అందుకొని వెంటనే ఎమర్జెన్సీ బ్రేకు వేసి రైలును సకాలంలో ఆపాడు.
 
ఈ సంఘటన గత గురువారం భాలుకా రోడ్డు యార్డు సమీపంలో జరిగింది. మాల్డాలోని 12 ఏళ్ల బాలుడు తన ఎర్ర చొక్కాను ఊపుతూ, వేగంగా వెళ్తున్న ప్యాసింజర్ రైలు లోకో-పైలట్‌ను వర్షంతో దెబ్బతిన్న భాగాన్ని దాటకుండా రైలును ఆపేలా ధైర్యం చేసుకున్నాడు. వర్షం ధాటికి మట్టి, గులకరాళ్లు కొట్టుకుపోయిన చోట పట్టాలు పాడైపోయాయి.
 
వలస కూలీ కొడుకు ముర్సలిన్ సేఖ్ ​​అనే బాలుడు కూడా రైల్వే సిబ్బందితో యార్డ్‌లో ఉన్నాడు. రైలు పట్టాల కింద వర్షం కారణంగా దెబ్బతిన్న భాగాన్ని గమనించిన బాలుడు ఆ సమయంలో తెలివిగా వ్యవహరించి అప్రమత్తం చేశాడు. దీంతో రైలు ఆగిపోయింది. దీంతో పెను ప్రమాదం తప్పింది.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాహుల్ గాంధీ రైలు ప్రయాణం... సమస్యలు చెప్పుకున్న ప్రయాణికులు