Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రామ్ పోతినేని, ఊర్వశి రౌతేలా తో స్కంద నుంచి కల్ట్ మామా సాంగ్

Advertiesment
Ram Pothineni, Urvashi Rautela
, శనివారం, 16 సెప్టెంబరు 2023 (17:19 IST)
Ram Pothineni, Urvashi Rautela
బోయపాటి శ్రీను, ఉస్తాద్ రామ్ పోతినేని క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘స్కంద-‘ది ఎటాకర్‌ ట్రైలర్‌కు దేశవ్యాప్తంగా ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ట్రైలర్‌లో రామ్‌ని రెండు డిఫరెంట్ లుక్‌లలో చూపించగా, సెకండ్ లుక్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ట్రైలర్ రామ్ యాక్షన్-ప్యాక్డ్ అవతార్‌ లో ప్రజంట్ చేయగా,  సెప్టెంబర్ 18న విడుదల కానున్న నాల్గవ పాట కల్ట్ మామాలో రామ్ అద్భుతమైన డ్యాన్స్ లు ఆలరించబోతున్నాయి. ఈ పాటలో ఊర్వశి రౌతేలా కూడా సందడి చేయనున్నారు.  
 
పాట అనౌన్స్ మెంట్ పోస్టర్‌లో రామ్ మునుపెన్నడూ లేని విధంగా రగ్గడ్, మ్యాసీ అవతార్‌లో కనిపించారు, ఇందులో ఊర్వశి రౌతేలా మెరిసే దుస్తులలో సూపర్-హాట్‌గా కనిపిస్తుంది. బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్‌లు అసాధారణమైన మేకప్‌తో భయపెడుతున్నారు. కల్ట్ మామా, అతని కల్ట్ మానియాను చూడటానికి మనం మరో రెండు రోజులు వేచి ఉండాలి.
 
ఎస్ థమన్ ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ ఆల్బమ్ అందించారు. మొదటి మూడు పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం రామ్‌కు ఎక్స్ పెన్సీవ్ మూవీ. శ్రీలీల కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సాయి మంజ్రేకర్ కీలక పాత్రలో కనిపించనున్నారు.
 
సంతోష్ డిటాకే సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్న ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ సౌత్,పవన్ కుమార్ సమర్పిస్తున్నారు. ఎడిటర్ తమ్మిరాజు.  
 
స్కంద సెప్టెంబర్ 28న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం , హిందీ భాషల్లో పాన్ ఇండియా విడుదల కానుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నవీన్ పోలిశెట్టి కామిక్ టైమింగ్, అనుష్క ఛార్మింగ్ ఆకట్టుకుంది : రామ్ చరణ్