Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శిలాఫలకం వేశా... వచ్చారో కాళ్లూ చేతులూ నరికేస్తా : ఎమ్మెల్యే వార్నింగ్

Advertiesment
శిలాఫలకం వేశా... వచ్చారో కాళ్లూ చేతులూ నరికేస్తా : ఎమ్మెల్యే వార్నింగ్
, ఆదివారం, 6 జనవరి 2019 (15:05 IST)
కర్ణాటక శాఖ అటవీ శాఖ అధికారిపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే బీకే సంగమేశ్వర రెచ్చిపోయారు. బహిరంగంగా వార్నింగ్ ఇచ్చారు. ఇక్కడ శిలాఫలకం వేశాను. పనులు కూడా ప్రారంభమవుతున్నాయి. అడ్డుకునేందుకు ఏ ఒక్క అధికారి ఇక్కడకు రాకూడదు. వచ్చారో కాళ్లూ చేతులు నరికేస్తా. మంచి మాటలు మీచెవికెక్కవు. ఇదే నా హెచ్చరిక అంటూ ఎమ్మెల్యే రెచ్చిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతూ వివాదం రేపుతోంది.
 
కర్ణాటక రాష్ట్రంలోని భద్రావతి ప్రాంతంలో ఆలయ నిర్మాణం చేపట్టాలని కొందరు గ్రామస్థులు నిర్ణయించారు. అనుకున్నదే తడవు డిసెంబరు 31వ తేదీన శంకుస్థాపన కూడా జరిపించారు. అయితే ఆ నిర్మాణంపై అటవీ శాఖ అధికారి ఒకరు అభ్యంతరం వ్యక్తంచేశారు. అటవీ శాఖ భూమిలో ఎలాంటి నిర్మాణం చేపట్టాలన్నా ముందుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని అధికారి చెప్పారు. 
 
ఈ విషయాన్ని ఎమ్మెల్యే సంగమేశ్వరర్ దృష్టిసారించారు. దీంతో సదరు అధికారికి సంగమేశ్వర్ నేరుగా ఫోను చేశారు. స్వయంగా తానే ఇక్కడ శిలాఫలకం వేశానని, పని కూడా మొదలవుతుందని చెబుతూ... ఎవరైనా అడ్డుకుంటే కాళ్లూ చేతులూ నరికేస్తామంటూ హెచ్చరించారు. ఈ వ్యవహారం మొత్తం వీడియోలో రికార్డు కావడంతో ఎమ్మెల్యే వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శివరాజ్‌కు బీజేపీ పగ్గాలు.. గడ్కరీకి ఉప ప్రధాని పదవి : బీజేపీ నేత లేఖ