Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చెత్త కుప్పలో రూ.25 కోట్ల విలువ చేసే డాలర్ కరెన్సీ నోట్లు.. ఎక్కడ?

currency
, శుక్రవారం, 10 నవంబరు 2023 (11:29 IST)
దేశ ఐటీ రాజధానిగా గుర్తింపు పొందిన బెంగుళూరు నగరంలో చెత్త కుప్పలో ఏకంగా రూ.25 కోట్ల విలువ చేసే డాలర్ కరెన్సీ నోట్లు బయటపడటం స్థానికంగా కలకలం రేగింది. మొత్తం రూ.23 నోట్ల బండిల్స్‌ ఈ చెత్త కుప్పలో కనిపించాయి. సల్మాన్ షేక్ అనే వ్యక్తి నగర శివారులో ఈ నెల ఒకటో తేదీన చెత్త తొలగిస్తుండగా, ఈ నోట్లు కనిపించడంతో ఆయన విస్తుపోయాడు.
 
ఆ తర్వాత ఈ నోట్లను ఇంటికి తీసుకెళ్లాడు. నవంబరు 5వ తేదీన ఆ మొత్తాన్ని తాను పని చేసే కంపెనీ యజమాని బొప్పాకు అప్పగించాడు. ఆ తర్వాత బొప్పా, స్థానిక సమాజిక కార్యకర్త కలిముల్లాతో కలిసి వెళ్లి బెంగళూరు పోలీసు కమిషనరును కలిసి విషయాన్ని వివరించారు. 
 
దీంతో, ఆయన కేసు దర్యాప్తు చేయమని హెబ్బల్ పోలీసులను ఆదేశించారు. కాగా, ఈ నోట్లపై రకరకాల రసాయనాలు పూసి ఉన్నట్టు కూడా వెలుగులోకి వచ్చింది. బ్లాక్ డాలర్ స్కామ్‌కు పాల్పడుతున్న ముఠాకు చెందిన వారు ఈ నోట్లను చెత్తలో పడేసి వెళ్లిపోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ డాలర్లు నకిలీవో కాదో తేల్చేందుకు పోలీసులు వీటిని ఆర్బీఐకి పంపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజస్థాన్‌లో దారుణం.. విద్యుదాఘాతానికి నలుగురి దుర్మణం