పుల్వామా ఉగ్రదాడిలో కీలక పాత్ర పోషించిన ఇద్దరు తీవ్రవాదులను పోలీసులు హతం చేశారు. తద్వారా పాక్షింగానైనా భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. ఇటీవల కాశ్మీర్ రహదారిలో పుల్వామాలో 42 మంది జవాన్లను పొట్టనపెట్టుకున్న విషయం తెల్సిందే. ఈ ఉగ్రదాడిలో కీలక పాత్ర పోషించిన ఇద్దరు ఉగ్రవాదులను హతం చేశారు. ఫింగ్లాన్ ఎన్‌కౌంటర్‌లో భారత సైన్యం ఇద్దరినీ మట్టుబెట్టింది.
వీరిలో ఒకరు జైషే మహ్మద్ కమాండర్ కమ్రాన్ ఘాజీ కాగా, మరో ఉగ్రవాది కూడా ఉన్నాడు. సీఆర్‌పీఎఫ్‌పై దాడి జరిగిన ప్రాంతానికి దగ్గర్లోనే ఎన్‌కౌంటర్ జరిగింది. అయితే.. ఈ ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాదులకు, సైనికులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో మేజర్ సహా నలుగురు జవాన్లు మృతి చెందడం శోచనీయం. జవాన్లపై దాడి తర్వాత ఓ ఇంట్లో ఇద్దరు ఉగ్రవాదులు నక్కి ఉండటాన్ని సైనికులు గమనించారు. అదను చూసి కాల్పులు జరపడంతో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.