Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎయిర్‌టెల్‌ ఔట్‌గోయింగ్‌ కాల్స్‌పై పరిమితి ఎత్తివేత

ఎయిర్‌టెల్‌ ఔట్‌గోయింగ్‌ కాల్స్‌పై పరిమితి ఎత్తివేత
, సోమవారం, 9 డిశెంబరు 2019 (07:42 IST)
ఇతర నెట్‌వర్కులకు చేసే కాల్స్‌ విషయంలో అన్‌లిమిటెడ్‌ ప్లాన్లలో ఉన్న పరిమితిని ఎత్తివేస్తూ టెలికాం ఆపరేటర్‌ భారతీ ఎయిర్‌టెల్‌ నిర్ణయం తీసుకుంది. డిసెంబర్‌ 3 నుంచి అమల్లోకి తీసుకొచ్చిన కొత్త ప్లాన్లలో ఈ మేరకు మార్పు చేసింది.

ఎయిర్‌టెల్‌ ఇటీవల తన ప్రీపెయిడ్‌ ప్లాన్ల ధరలను గరిష్ఠంగా 50 శాతం వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలు కొత్త అన్‌లిమిటెడ్‌ ప్లాన్లు ప్రకటించింది. 28 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌పై 1000 నిమిషాలు, 84 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌కు 3వేలు, 365 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌పై 12వేల నిమిషాల పరిమితి విధించింది.

ఆ పరిమితి దాటిన తర్వాత ఇతర నెట్‌వర్క్‌కు చేసే కాల్స్‌కు నిమిషానికి ఆరు పైసలు వసూలు చేస్తామని ప్రకటించింది. శనివారం నుంచి అన్‌లిమిటెడ్‌ ప్లాన్లు ఉపయోగించి దేశవ్యాప్తంగా ఏ ఇతర నెట్‌వర్క్‌కు అయినా అపరిమితంగా మాట్లాడొచ్చని, ఎలాంటి షరతులూ ఉండబోవని ఎయిర్‌టెల్‌ ట్వీట్‌ చేసింది. ఎయిర్‌టెల్‌తో పాటు వొడాఫోన్‌ ఐడియా, జియో కూడా తమ ప్లాన్ల ధరలు పెంచిన సంగతి తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైసీపీ ఎంపీలకు కేంద్ర మంత్రుల సలహా!