Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

Advertiesment
vijay

ఠాగూర్

, శుక్రవారం, 28 మార్చి 2025 (14:52 IST)
సినీ హీరో విజయ్ సారథ్యంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ విద్యా విధానంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన త్రిభాషా విద్యావిధానానికి వ్యతిరేకంగా తీర్మానం చేసింది. ద్విభాషా విద్యా విధానమే ముద్దు అంటూ ఆ పార్టీ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేసింది. అలాగే, కేంద్రం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ బిల్లును కూడా రద్దు చేయాలని టీవీకే జనరల్ కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేశారు. 
 
తమ పార్టీ ద్విభాషా విద్యా విధానానికే కట్టుబడివున్నట్టు తెలిపింది. విద్యా విధానంలో మూడు భాషల విధానం అమలు ప్రతిపాదన ఫెడరలిజానికి విరుద్ధమని, దీన్ని ఎప్పటికీ తాము అంగీకరించమని స్పష్టం చేసింది. అలాగే, లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు తగ్గుతాయని, అందువల్ల పునర్విభజనను వాయిదా వేయాలని కోరింది. 
 
ఇకపోతే, ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్‌పై ఆ  డీఎంకే తప్పుడు వాగ్ధానాలు చేస్తోందని పేర్కొంది. శ్రీలంకలో అరెస్టు అయిన తమిళ జాలర్లను విడిపించి, వారి సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనాలంటూ తీర్మానం చేసింది. ఇందులో వక్ఫ్ బిల్లును ఉపసంహరించుకోవాలని కోరుతూ చేసిన తీర్మానాన్ని కేంద్రానికి పంపించాలని ఆ పార్టీ నిర్ణయించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మయన్మార్‌లో భారీ భూకంపం.. పేక మేడల్లా కూలిపోయిన భవనాలు (Video)