Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Vijay Deverakond: హోం టౌన్ ట్రైలర్ రిలీజ్ చేసి బెస్ట్ విశెస్ చెప్పిన విజయ్ దేవరకొండ

Advertiesment
Home Town team with Vijay Deverakonda

దేవీ

, మంగళవారం, 25 మార్చి 2025 (16:51 IST)
Home Town team with Vijay Deverakonda
ఆహా సబ్ స్క్రైబర్స్ కోసం వస్తున్న మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ హోం టౌన్. మన ఇంటి చుట్టు అల్లుకున్న జ్ఞాపకాలు, బంధాల నేపథ్యంతో ఈ వెబ్ సిరీస్ రూపొందింది. రాజీవ్ కనకాల, ఝాన్సీ, ప్రజ్వల్ యాద్మ, సాయిరామ్, అనీ, అనిరుధ్, జ్యోతి కీలక పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ కు శ్రీకాంత్ రెడ్డి పల్లే దర్శకత్వం వహించారు. నవీన్ మేడారం, శేఖర్ మేడారం నిర్మించారు.

ఏప్రిల్ 4వ తేదీ నుంచి హోం టౌన్ వెబ్ సిరీస్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఈ రోజు ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ను హీరో విజయ్ దేవరకొండ రిలీజ్ చేశారు. హోం టౌన్  ట్రైలర్ తనకు బాగా నచ్చిందని చెప్పిన విజయ్..వెబ్ సిరీస్ టీమ్ కు తన బెస్ట్ విశెస్ అందించారు.
 
హోం టౌన్ వెబ్ సిరీస్ ట్రైలర్ ఎమోషన్, ఎంటర్ టైన్ మెంట్ తో ఆకట్టుకుంది. ఉపాధి కోసం సొంతూర్లను వదిలి వచ్చినా, ఆ జ్ఞాపకాలను మాత్రం మర్చిపోలేం. మళ్లీ ఆ జ్ఞాపకాలను గుర్తు చేసేలా ట్రైలర్ ఉంది. జ్యోతి ఫొటో స్టూడియో జీవనోపాధిగా ఉన్న రాజీవ్ కనకాల..తన కొడుకు శ్రీకాంత్ (ప్రజ్యల్ యాద్మ)ను విదేశాల్లో చదివించి గొప్ప స్థాయిలో చూడాలనుకుంటాడు. కానీ శ్రీకాంత్ ఫ్రెండ్స్ తో సరదాగా గడిపే ఓ సగటు మధ్య తరగతి కుర్రాడు, అతనికి చదువుల మీద శ్రద్ధ ఉండదు. ఇక్కడే కుటుంబంలో సంఘర్షణ ఏర్పడుతుంది. తండ్రి కోరుకున్నట్లు  శ్రీకాంత్ విదేశాల్లో చదివేందుకు ఒప్పుకున్నాడా లేదా, కొడుకును విదేశాల్లో చదివించేందుకు మధ్య తరగతి తండ్రి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అనేది హోం టౌన్ వెబ్ సిరీస్ ట్రైలర్ లో ఆసక్తికరంగా చూపించారు. ఝాన్సీ, అనీ, రాజీవ్ కనకాల, ప్రజ్వల్ యాద్మ తమ పర్ ఫార్మెన్స్ లతో ఆకట్టుకున్నారు. 
 
ఈ సిరీస్ కు దేవ్ దీప్ గాంధీ కుండు సినిమాటోగ్రాఫర్ కాగా...సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Rajendra Prasad: డేవిడ్ వార్నర్‌ సన్నిహితుడు.. క్షమించండి: మత్తు దిగిందా?