Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాంబవ్ జిల్లాలో బాబు పేలుడు : ఉగ్రవాదుల కాల్పులు

రాంబవ్ జిల్లాలో బాబు పేలుడు : ఉగ్రవాదుల కాల్పులు
, ఆదివారం, 8 ఆగస్టు 2021 (11:54 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో జాతీయ దర్యాప్తు బృందం విస్తృతంగా తనిఖీ చేస్తున్నారు. మరోవైపు, ఉగ్ర‌వాదులు కాల్పులకు తెగ‌బ‌డ్డారు. కుల్గాంలో ట్రాఫిక్ నియంత్ర‌ణ ప‌నుల్లో ఉన్న పోలీసులపై ఉగ్ర‌వాదులు కాల్పులకు పాల్ప‌డ‌డంతో ఓ పోలీసు వీర‌మ‌ర‌ణం చెందారు. 
 
కాల్పుల ఘ‌ట‌న‌లో మ‌రో ఇద్ద‌రు పోలీసుల‌కు తీవ్ర‌గాయాల‌య్యాయి. ఈ ఘ‌ట‌న‌తో అప్ర‌మ‌త్త‌మైన భ‌ద్ర‌తా బ‌ల‌గాలు ఉగ్ర‌వాదుల కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టాయి. 
 
మ‌రోవైపు, జ‌మ్మూకాశ్మీర్‌లోని రాంబ‌వ్ జిల్లాలో బాంబు పేలుడు క‌ల‌క‌లం సృష్టించింది. జాతీయ ర‌హ‌దారి స‌మీపంలో జ‌రిగిన ఈ పేలుడు ధాటికి ఓ బాలుడితో పాటు మరో పౌరుడికి తీవ్ర‌గాయాల‌య్యాయి. దీంతో వారిని ఆసుప‌త్రికి త‌ర‌లించిన భ‌ద్ర‌తా సిబ్బంది చికిత్స అందిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశంలో కరోనా పాజిటివ్ కేసులపై తాజా బులిటెన్...