Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తప్పుడు సమాచారాన్ని పట్టించే ట్విట్టర్ 'బర్డ్‌వాచ్'

తప్పుడు సమాచారాన్ని పట్టించే ట్విట్టర్ 'బర్డ్‌వాచ్'
, సోమవారం, 7 జూన్ 2021 (11:28 IST)
తప్పుడు సమాచారాన్ని కట్టడి చేయడంలో భాగంగా ట్విట్టర్ బర్డ్‌వాచ్ అనే కొత్త టూల్‌ను అభివృద్ధి చేసింది. డెస్క్‌టాప్, ఆండ్రాయిడ్, ఐవోఎస్ వినియోగదారుల్లో కొంతమందికి పైలెట్ ప్రాజెక్టుగా దీన్ని రోల్‌ఔట్ చేస్తున్నట్టు మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ అధికారికంగా ప్రకటించింది. 
 
బర్డ్‌వాచ్ అనేది సాధనాల సేకరణ కంటే మరేమీ కాదు క్రౌడ్ సోర్సింగ్ కోసం రూపొందించబడింది. ట్వీట్లను తప్పుదోవ పట్టించేదిగా గుర్తించడానికి వినియోగదారులను అనుమతించండి. వారు కలిగి ఉన్న సమాచారానికి సందర్భం అందించగల గమనికలను రాయడం. 
 
ఈ బర్డ్ వాచ్ ద్వారా యూజర్స్ తమకు అనుమానమున్న ట్వీట్‌లను మార్క్ చేసి, అందుకు గల కారణాలను వివరించాలి. మనం ఏదైన ట్వీట్‌ను బర్డ్‌వాచ్‌తో మార్క్ చేసిన తర్వాత సదరు ట్వీట్‌పై ఫీడ్ బ్యాక్ ఇవ్వాల్సి ఉంటుంది.
 
ఫీడ్ బ్యాక్ సహాయకరంగా ఉందో లేదే రేట్ చేసే అవకాశం వినియోగదారులకు ఉంటుందని ట్విట్టర్ తెలిపింది. ఈ క్రమంలోన ట్వీట్‌కు ఇచ్చిన రిప్లయ్‌లు ఏవీ సహాయపడవని భావిస్తో బర్డ్‌వాచ్ కార్డ్ డిజప్పియర్ అవుతుంది. ఒకవేళ ఇచ్చిన నోట్స్ సహకరంగా భావించినట్టయితే అవి ట్వీట్‌లోపల నేరుగా పాపవ్ అవుతాయి. 
 
ట్వీట్ చేసిన సమాచారం తప్పా, ఒప్పో తెలుసుకోవడాని బర్డ్ వాచ్ సాయపడుతుంది. ట్వీట్‌లో చేసిన ఇన్ఫర్మేషన్ తప్పు అనిభావించిన ట్విట్టర్ యూజర్ దానిపై బర్డ్‌వాచ్‌తో టిక్ చేయొచ్చు. సదరు ట్వీట్ ఎందుకు తప్పో తెలుసుకునేందుకు చిన్నపాటి సర్వే జరుగుతుంది. దానిపై ట్వీపుల్స్ రిపోర్టు చేయొచ్చు. ఒకవేళ ఆ ట్వీట్ సరైనది అయితే ఒకే చెప్పొచ్చు. లేదంటే తప్పని వెల్లడించొచ్చు. 
 
చివరికి విస్తృత విభిన్నమైన యూజర్ల నుంచి ఏకాభిప్రాయం ఉన్నపుడు గ్లోబల్ ట్విట్టర్ ప్రేక్షకుల కోసం ఆ నోట్స్ ట్వీట్లలో నేరుకు కనిపించేలా డిస్‌ప్లే చేస్తుంది. తప్పుదోవ పట్టించే సమాచారం వ్యాప్తి చెందుతున్నపుడు ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది. ఇదే బర్డ్‌వాచ్ ఫీచర్‌గా పేర్కొంటారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జూన్ 7న కరోనా బులిటెన్ - కొత్తగా ఎన్ని కేసులంటే..