ట్విట్టర్, కేంద్రం మధ్య పోరు జరుగుతున్న సంగతి తెలిసిందే. కొత్త ఐటీ చట్టం అమలుపై కేంద్రం, ట్విట్టర్ సంస్థల పోరు కొనసాగుతుండగా… ఐటీ చట్టం అమలు చేయాల్సిందేనని ట్విట్టర్‌కు భారత ప్రభుత్వం తేల్చి చెప్పింది.
ఆదివారం ఉదయం భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అధికారిక గుర్తింపు మార్క్‌ను ట్విట్టర్‌ను తొలిగించింది. దీనిపై సర్వత్రా విమర్శలు రాగానే వెనక్కి తగ్గి పునరుద్ధరించింది.
ఆ తర్వాత కొద్దిసేపటికే కేంద్రం ట్విట్టర్‌కు ఐటీ చట్టం అమలుపై ఫైనల్ వార్నింగ్ ఇచ్చింది. ఈ చట్టం ప్రకారం భారతీయులను గ్రీవెన్స్ అధికారిగా నియమిస్తారా? లేదా? అని హెచ్చరించింది.
కొత్త ఐటీ నిబంధనలకు తగ్గట్టు ట్విట్టర్ నడుచుకోవాలని, లేదంటే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని, ఇదే చివరి నోటీసు అంటూ స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ కొత్త ఐటీ చట్టంపై కేంద్రం, ట్విట్టర్‌లు కోర్టులను ఆశ్రయించాయి.