Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రపంచంలోనే తొలి ఫ్రేమ్‌లెస్ 8K టీవీ శాంసంగ్ వచ్చేస్తోంది..

ప్రపంచంలోనే తొలి ఫ్రేమ్‌లెస్ 8K టీవీ శాంసంగ్ వచ్చేస్తోంది..
, గురువారం, 2 జనవరి 2020 (18:28 IST)
ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రానిక్స్ మానుఫ్యాక్చర్ సంస్థ శాంసంగ్ ఎప్పటికప్పుడు సరికొత్త ఉత్పత్తులను మార్కెట్‌లోకి విడుదల చేస్తోంది. అందులో భాగంగానే ప్రపంచంలోనే తొలి ఫ్రేమ్‌లెస్ 8K టీవీని లాంచ్ చేయనుంది. ఈ టీవీకి సంబంధించి ఇప్పటికే కొన్ని చిత్రాలు నెట్‌లో లీకైయ్యాయి. శాంసంగ్ సంస్థ ఈ టీవీ కోసం 8K సర్టిఫికేషన్‌ను కూడా పొందనుంది. ఈ టీవీలో పలు ఆకర్షణీయమైన మరియు అద్భుతమైన ఫీచర్‌లను పొందుపరచనున్నట్లు తెలిపింది. 
 
ఈ టీవీలో 7680 x 4320 పిక్సల్స్‌ 8K స్క్రీన్‌ రిజల్యూషన్‌, హెచ్‌డిఎంఐ 2.1 ఇమేజ్‌ ట్రాన్స్‌మిషన్‌, వన్‌ కనెక్ట్‌ ఫంక్షన్‌ వంటి ఫీచర్లను శాంసంగ్‌ సంస్థ అందిస్తుందని తెలిసింది. అయితే త్వరలో జరగనున్న కన్‌జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ షోలో శాంసంగ్‌ ఈ టీవీని ప్రదర్శించనుందని తెలిసింది. టీవీ మార్కెట్‌లో మిగిలిన సంస్థల నుండి గట్టి పోటీని ఎదుర్కొంటూ శాంసంగ్ సంస్థ సరికొత్త ఉత్పత్తులతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒంటికాలిపై వస్తున్నారు.. నాకూ టైమ్ వస్తుంది : చంద్రబాబు