Publish Date: Sat, 28 Mar 2026 (22:33 IST)
Updated Date: Sat, 28 Mar 2026 (22:35 IST)
ప్రజలు ప్రతిరోజూ తమ ఫోన్‌లను వాస్తవంగా ఎలా ఉపయోగిస్తారో అనే ఒక సాధారణ ఆలోచనతో రూపొందించబడిన స్మార్ట్‌ఫోన్ అయిన రెడ్‌మి 15A 5Gని షావోమి ఇండియా ఈరోజు విడుదల చేసింది. స్ట్రీమింగ్ అయినా, స్క్రోలింగ్ అయినా, కనెక్ట్ అయి ఉండటం అయినా, లేదా అనేక యాప్‌లను ఒకేసారి ఉపయోగించడం అయినా, రెడ్‌మి 15A 5G విషయాలను అనవసరంగా క్లిష్టతరం చేయకుండా, సున్నితమైన, విశ్వసనీయమైన మరియు దీర్ఘకాలిక అనుభవాన్ని అందించడంపై దృష్టి సారిస్తోంది.
విరామం లేని రోజుల కోసం రూపొందించబడింది
ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌లో చాలా ఎక్కువ పనులు చేయాలని ఆశిస్తున్నారు. ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని రెడ్‌మి 15A 5G నిర్మించబడింది. దీని 6300mAh బ్యాటరీ, వీడియో స్ట్రీమింగ్, సోషల్ మీడియా, కాల్స్ మరియు నావిగేషన్ వంటి వాటి అధిక వినియోగ సమయంలో కూడా, ఒకే ఛార్జ్‌పై రెండు రోజుల వరకు సౌకర్యవంతంగా పనిచేసేలా రూపొందించబడింది. ఇది నిరంతరం ఛార్జర్ కోసం వెతకాల్సిన అవసరాన్ని తగ్గిస్తుంది, అందువల్ల ఎల్లప్పుడూ ప్రయాణంలో ఉండే వినియోగదారులకు ఇది ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది.
మీరు ఛార్జింగ్ పెట్టవలసి వచ్చినప్పుడు, ఈ పరికరం 15W ఛార్జింగ్‌తో పాటు, 7.5W వైర్డ్ రివర్స్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది, ఇది రోజువారీ సౌకర్యాన్ని మరింత పెంచుతుంది.
వాడటానికి సులభంగా అనిపించే డిస్‌ప్లే
REDMI 15A 5Gలో పెద్ద 6.9-అంగుళాల డిస్‌ప్లే ఉంది, ఇది వీడియోలు చూడటం నుండి బ్రౌజింగ్ చేయడం వరకు ప్రతిదాన్ని మరింత లీనమయ్యేలా చేస్తుంది. 120Hz వరకు రిఫ్రెష్ రేట్ ఉండటంతో, మీరు ఫీడ్‌లను స్క్రోల్ చేస్తున్నా లేదా యాప్‌ల మధ్య మారుతున్నా, మీ ప్రతి స్పర్శ మరింత మృదుఫుగా మరియు వేగంగా అనిపిస్తుంది.
ఇది వాస్తవ ప్రపంచ పరిస్థితులను తట్టుకునేలా కూడా నిర్మించబడింది. 800 నిట్స్ వరకు బ్రైట్‌నెస్‌తో, స్క్రీన్ బయట కూడా స్పష్టంగా కనిపిస్తుంది, అదే సమయంలో వెట్ టచ్ టెక్నాలజీ 2.0, చేతులు తడిగా ఉన్నప్పటికీ డిస్‌ప్లే కచ్చితంగా స్పందించేలా చేస్తుంది. ఎక్కువసేపు ఉపయోగించడం కోసం, ఈ డిస్‌ప్లే ట్రిపుల్ TÜV రైన్‌ల్యాండ్ సర్టిఫికేషన్‌లతో వస్తుంది, అవి తక్కువ బ్లూ లైట్, ఫ్లికర్-ఫ్రీ, సర్కాడియన్-ఫ్రెండ్లీ గా ఉండటం వల్ల ఇవి కంటి ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి.
ఆధారపడతగిన పనితీరు, సౌకర్యవంతమైన కనెక్టివిటీ
REDMI 15A 5G ప్రధానంగా ఆక్టా-కోర్ 5G ప్రాసెసర్‌తో పనిచేస్తుంది, ఇది పనితీరు, సామర్థ్యం మధ్య సున్నితమైన సమతుల్యతను అందిస్తుంది. యాప్‌ల మధ్య మారడం, వీడియో కాల్స్‌లో పాల్గొనడం లేదా కంటెంట్‌ను స్ట్రీమింగ్ చేయడం వంటి రోజువారీ పనులను ఈ పరికరం సులభంగా నిర్వహిస్తుంది. దీనికి తోడు, డ్యూయల్-బ్యాండ్ వై -ఫై, బ్లూటూత్ 5.4 మరియు నమ్మకమైన నావిగేషన్ సిస్టమ్‌లతో కూడిన పటిష్టమైన కనెక్టివిటీ సపోర్ట్ ఉంది, ఇది మీరు ఎక్కడ ఉన్నా సౌకర్యవంతంగా కనెక్ట్ అయి ఉండేలా చేస్తుంది.
రోజువారీ వినోదం, దీర్ఘకాలిక విశ్వసనీయత కోసం రూపొందించబడింది
లీనమయ్యే ఆడియో నుండి అద్భుతమైన ఫోటోగ్రఫీ వరకు, రెడ్ మి 15A 5G రోజువారీ అనుభవాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి రూపొందించబడింది. వీడియోలు చూడటం, సంగీతం వినడం లేదా స్పీకర్‌పై కాల్స్ తీసుకోవడం వంటి వాటిలో, ఈ పరికరం 200% వరకు వాల్యూమ్ బూస్ట్‌తో బిగ్గరగా, స్పష్టమైన ధ్వనిని అందిస్తుంది. దీనికితోడు, 32ఎంపి ఏఐ డ్యూయల్ రియర్ కెమెరా, 8ఎంపి ఫ్రంట్ కెమెరా, త్వరిత ఫోటోల నుండి వీడియో కాల్స్, సోషల్ మీడియా కంటెంట్ వరకు రోజువారీ క్షణాలను సులభంగా బంధించడానికి రూపొందించబడ్డాయి.
రోజువారీ వినియోగానికి మించి, రెడ్ మి 15A 5G దీర్ఘ కాలం పాటు విశ్వసనీయంగా పనిచేసేలా రూపొందించబడినది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైపర్‌ఓఎస్ 3.0 పై పనిచేసే ఈ ఫోన్‌కు 4 సంవత్సరాల ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లు, 6 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లు లభిస్తాయి, ఇవి నిరంతరం సురక్షితమైన, అప్-టు-డేట్ అనుభవాన్ని అందిస్తాయి. మన్నిక కోసం ఐపి52 రేటింగ్, త్వరిత యాక్సెస్ కోసం ఫింగర్‌ప్రింట్ స్కానర్, డ్యూయల్ సిమ్ సపోర్ట్, 2టిబి వరకు విస్తరించగల స్టోరేజ్ వంటి ఆచరణాత్మక అదనపు ఫీచర్లు రోజువారీ అవసరాల కోసం దీని వినియోగాన్ని మరింత మెరుగుపరుస్తాయి.
ధర, లభ్యత
రెడ్‌మి 15A 5G యొక్క 4GB+64GB వేరియంట్ ధర రూ. 12,999 నుండి ప్రారంభమవుతుంది. 4GB+128GB, 6GB+128GB మోడళ్ల ధరలు వరుసగా రూ. 14,499, రూ. 16,499గా ఉన్నాయి. ఈ ఉపకరణం ఏప్రిల్ 3వ తేదీ నుండి ఫ్లిప్‌కార్ట్, అధీకృత షావోమి రిటైల్ స్టోర్‌ల వద్ద అందుబాటులో ఉంటుంది.