Publish Date: Tue, 24 Mar 2026 (19:33 IST)
Updated Date: Tue, 24 Mar 2026 (19:51 IST)
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) కీలక ముందడుగు వేసింది. ఎన్‌పీసీఐకు చెందిన ఎన్‌పీసీఐ భీమ్ సర్వీసెస్ లిమిటెడ్ (ఎన్‌బీఎస్ఎల్), మంగళవారం భీమ్ పేమెంట్స్ యాప్‌లో సరికొత్త బయోమెట్రిక్ అథెంటికేషన్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.
ఈ కొత్త అప్‌డేట్ ద్వారా వినియోగదారులు రూ. 5,000 వరకు జరిపే లావాదేవీలకు తమ స్మార్ట్‌ఫోన్‌లోని వేలిముద్ర లేదా ఫేషియల్ రికగ్నిషన్ ఉపయోగించి సులభంగా ఆమోదం తెలపవచ్చు.
ఈ ఫీచర్‌తో ప్రతి చిన్న లావాదేవీకి యూపీఐ పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు. చాలా సందర్భాల్లో పిన్ మర్చిపోవడం లేదా తప్పుగా నమోదు చేయడం వల్ల చెల్లింపులు విఫలమవుతుంటాయి. ఈ కొత్త విధానం ద్వారా అలాంటి ఇబ్బందులకు తెరపడుతుంది.
ఈ సందర్భంగా ఎన్‌బీఎస్ఎల్ ఎండీ, సీఈవో లలితా నటరాజ్ మాట్లాడుతూ.. వినియోగదారులు తమ వేలిముద్ర లేదా ఫేస్ అన్‌లాక్ ద్వారా లావాదేవీలను నిర్ధారించడం వల్ల పిన్‌పై ఆధారపడటం తగ్గుతుంది.
అదే సమయంలో చెల్లింపులు యూజర్ బయోమెట్రిక్‌తో ముడిపడి ఉండటం వల్ల బలమైన భద్రత కూడా కొనసాగుతుంది" అని ఆమె వివరించారు.