రియల్‌మీ నుంచి నార్జో సిరీస్ భారత మార్కెట్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నార్జో 10, నార్జో 10ఏ స్మార్ట్‌ఫోన్లను ఇప్పటికే విడుదల చేసింది. ఇప్పుడు నార్జో 20 సిరీస్ స్మార్ట్‌ఫోన్లను పరిచయం చేసింది. ఏకంగా 3 స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేసింది. రియల్‌మీ నార్జో 20, రియల్‌మీ నార్జో 20ఏ, రియల్‌మీ నార్జో 20 ప్రో మోడల్స్‌ని ఆవిష్కరించింది రియల్‌మీ.
ఈ మూడు స్మార్ట్‌ఫోన్‌లో ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్, ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో లభిస్తాయి. రియల్‌మీ నార్జో 20 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే 10 శాతం డిస్కౌంట్ పొందొచ్చు.
మూడు ఫోన్లూ వేర్వేరు స్పెసిఫికేషన్స్‌తో వేర్వేరు సెగ్మెంట్లలో రిలీజ్ అయ్యాయి. రియల్‌మీ నార్జో 20ఏ ప్రారంభ ధర రూ.8,499 కాగా రియల్‌మీ నార్జో 20 ప్రారంభ ధర రూ.10,499. ఇక రియల్‌మీ నార్జో 20 ప్రో ప్రారంభ ధర రూ.14,999. రియల్‌మీ నార్జో 20ఏ సేల్ సెప్టెంబర్ 30న, రియల్‌మీ నార్జో 20 సేల్ సెప్టెంబర్ 28న, రియల్‌మీ నార్జో 20 ప్రో సేల్ సెప్టెంబర్ 25న ప్రారంభం కానుంది.