Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆన్‌లైన్ ఎడ్యుకేషన్‌ కోసం లావా కొత్త ట్యాబ్‌లు.. కళ్లపై ఒత్తిడి పడకుండా..?

ఆన్‌లైన్ ఎడ్యుకేషన్‌ కోసం లావా కొత్త ట్యాబ్‌లు.. కళ్లపై ఒత్తిడి పడకుండా..?
, శనివారం, 20 మార్చి 2021 (13:50 IST)
Lava
విద్యార్థుల ఆన్‌లైన్ ఎడ్యుకేషన్‌ కోసం దేశీయ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ లావా ప్రత్యేకంగా మూడు ట్యాబ్‌లను రూపొందించింది. వీటిని తాజాగా మార్కెట్లోకి విడుదల చేసింది. ట్యాబ్‌ల ధరలు రూ.9,499 నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ శుక్రవారం లావా మాగ్నమ్ ఎక్స్ఎల్, లావా ఆరా, లావా ఐవరీ పేరుతో మూడు ట్యాబ్‌లను సంస్థ విడుదల చేసింది. 
 
ఆన్‌లైన్ ఎడ్యుకేషన్లో భాగంగా విద్యార్థులకు ఉచిత కోర్సులను అందించేందుకు EduSaksham సంస్థతో ఒప్పదం చేసుకున్నట్లు లావా ప్రకటించింది. ఈ ఒప్పదంలో భాగంగా లావా టాబ్లెట్స్‌ను విద్యార్థుల కోసమే ప్రత్యేకంగా అభివృద్ధి చేసింది. ఈ ట్యాబ్లెట్ల ద్వారా విద్యార్థులు ఆన్‌లైన్ క్లాసులు, ఎడ్యుకేషన్‌కు సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్, ఈ-బుక్స్.. వంటి వాటిని సలభంగా యాక్సెస్ చేయవచ్చని సంస్థ పేర్కొంది.
 
లావా మాగ్నమ్ ఎక్స్ఎల్ ధర రూ.15,499గా ఉంది. లావా ఆరా ధర రూ.12,999 కాగా.. లావా ఐవరీ రూ.9,499కు లభిస్తుంది. వీటిని ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంచారు. విద్యార్థులకు అవసరమైన ఫీచర్లతో తక్కువ ధరల్లో ఈ ట్యాబ్‌లను రూపొందించామని లావా కంపెనీ బిజినెస్ హెడ్ సునీల్ రైనా తెలిపారు. వీటి ద్వారా ఆన్‌లైన్‌లో పాఠాలు వినడం సులభమవుతుందన్నారు. మెరుగైన బ్యాటరీ సామర్థ్యం, లాంగ్ స్టడీ అవర్స్ వంటి ఫీచర్లతో విద్యార్థులు లబ్ధి పొందవచ్చని చెప్పారు.
 
లావా మాగ్నమ్ ఎక్స్ఎల్ ఫీచర్లు.. 
10.1 అంగుళాల స్క్రీన్‌తో ఇది లభిస్తుంది. దీంట్లో 6100 mAH సామర్థ్యం ఉన్న బ్యాటరీ ఉంటుంది. 390 నిట్స్ బ్రైట్‌నెస్‌, IPS LCD డిస్‌ప్లే.. వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇవి ఎక్కువ సమయం స్క్రీన్‌ను చూసినప్పుడు కళ్లపై ఒత్తిడి పడకుండా చేస్తాయి. 
 
ఈ ట్యాబ్‌లో 2MP ఫ్రంట్ కెమెరా, 5MP రేర్ కెమెరా కూడా ఉన్నాయి. ఈ టాబ్లెట్ మీడియాటెక్ 2GHz క్వాడ్-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. దీంట్లో 32 GB ఇంటర్నల్ స్టోరేజ్‌ ఉంటుంది. దీన్ని 256 GB వరకు పొడిగించుకోవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ దేశాల మహిళల్ని పెళ్లి చేసుకుంటే కఠిన చర్యలు తప్పవ్: సౌదీ