Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విడోను ప్రేమించ‌డం త‌ప్పుకాదుః లావణ్య త్రిపాఠి

Advertiesment
విడోను ప్రేమించ‌డం త‌ప్పుకాదుః లావణ్య త్రిపాఠి
, సోమవారం, 15 మార్చి 2021 (19:22 IST)
Lavanya Tripathi
కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా కౌశిక్‌ పెగళ్లపాటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం `చావు క‌బురు చ‌ల్ల‌గా`. జీఏ2 పతాకంపై బన్నీ వాస్‌ నిర్మించారు. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ఈనెల 19న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఇంటర్వ్యూ.
 
ఈ కథ విన్నప్పుడు చాలా నచ్చింది. గీతా ఆర్ట్స్ లో మళ్లీ సినిమా చేస్తున్నందుకు సంతోషంగా ఉంది.  ఈ సినిమాలో ఎమోషన్స్ బాగుంటాయి, అందరూ కనెక్ట్ అవుతారు.

`చావు ఈరోజో పేరు అంద‌రికీ వ‌స్తుంది. కానీ చావును కూడా ఈజీగా తీసుకునే పాత్ర‌లో కార్తికేయ కినిప‌స్తాడు. నేను విడోను. న‌న్ను కార్తికేయ‌ ప్రేమిస్తాడు. వితంతువును ప్రేమించ‌డం పెళ్లిచేసుకోవ‌డం త‌ప్పుకాదు. ఈ క‌థ నాకు బాగా న‌చ్చింది. అందుకే న‌టించ‌డానికి ఆస‌క్తి చూపాను.
 
గీతా ఆర్ట్స్‌తో ఇది నాకు మూడో సినిమా. ఈ సినిమా ఎంతపెద్ద హిట్ అవుతుంది అనేది పక్కనబెడితే కథ ప్రకారం ఈ సినిమా నాకు నచ్చింది. దానికి కౌశిక్, వాసు, అరవింద్ గారికి థ్యాంక్స్. కౌశిక్ ఈ కథ చెప్పినపుడు సగంలోనే ఓకే చెప్పాను. ఇలాంటి కథ చెప్పినందుకు థ్యాంక్స్. కార్తికేయ మంచి కో ఆర్టిస్ట్. ఈ సినిమాకు పని చేసిన అందరికీ థ్యాంక్స్.
 
కొత్త టాలెంట్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు వాసుగారికి అరవింద్ గారికి మరోసారి థ్యాంక్స్. ఈ సినిమాకు నేనే డబ్బింగ్ చెప్పాలనుకున్నాను. కానీ కుదరలేదు. నెక్స్ట్ టైం తప్పకుండా నా సొంత వాయిస్ తో డబ్బింగ్ చెవుతాను.
కార్తికేయ ఎంత ఇంటెక్షన్ తో కథ రాసాడో అంతే ఇంటెక్షన్ తో కార్తికేయ ఈ సినిమాలో నటించాడు. ఒక మంచి సినిమాకు కావాల్సిన అంశాలన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. సరికొత్త స్క్రీన్ ప్లే అందరిని అలరిస్తుంది. మా సినిమాకు మీ అందరి సపోర్ట్ కావాలి. తెలుగులో ఒక థ్రిల్లర్ సినిమా సైన్ చేశాను, తమిళ్ లో ఒక సినిమా చేస్తున్నాను, పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తాను అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సినిమాగా సామాన్యుడి జీవిత కథ!