ప్రియదర్శి, యూత్ కమేడియన్‌గా పెండ్లిచూపులు సినిమాతో ఎంటరయ్యాడు. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేశాడు. లేటెస్ట్‌గా `జాతిరత్నాలు` సినిమాలు చేశాడు. ఆ సినిమాకు వస్తున్న ఆదరణ చూసి ఎలా రియాక్ట్ కావాలో నాకయితే అర్థమయితలే అంటున్నాడు. ఈ సినిమా కథ ఎలా పుట్టింది? ఎలా తను ఈ సినిమాలోకి ప్రవేశించాడనేది ఆయన మాటల్లో చూద్దాం.
- నాకు ఓరోజు రాహుల్ ఫోన్ చేశాడు. అరె కథ విన్నాను. నేను నవ్వలేక పడిపడి చచ్చిపోయాను అన్నాడు. వెంటనే మా మేనేజర్ సీతారామ్‌కు చెప్పాను. ఆయన చిత్ర దర్శకుడుని సంప్రదించాడు. ఆయన ఇదే చోట ఇక్కడే వైజయంతి ఆఫీసులో కూర్చుని కథ చెప్పాడు. `మీ పేరు శేఖర్. కుక్కర్ విజిల్ రాగానే మీరు పుడతారు` అన్నాడు. ఇదేమి చోద్యం ఇదే కథ అనుకున్నా. ఆ తర్వాత చెప్పగా చెప్పగా బాగా కనెక్ట్ అయ్యాను. ఆ తర్వాత చేస్తున్నా అన్నా. రెండు నెలలో సెట్‌పైకి వెళ్ళింది.
- ప్రతి ఆర్టిస్టుకు ఒక టైమింగ్ వుంటుంది. అది మాకు బాగా పనిచేసింది. షూటింగ్ చేస్తుండగా కొన్ని సిల్లీ జోక్‌లు వుంటాయి. వీటికి కూడా నవ్వుకుంటారా! అనే డౌట్ వచ్చింది. ఇది వర్కవుట్ అవదేమోనని అనుమానం కలిగింది కూడా. ఈ సినిమాలో ఓ సీన్ వుంది. కడ్డీలు పట్టుకుని మమ్మల్ని ఎవరూ ఆపలేరు ఇన్‌స్పెక్టర్ అంటాను.. కానీ థియేటర్లో జనాలు దానికీ నవ్వుతున్నారు.
- అదేవిధంగా ఇంటికోసం వెతుకుంటే ఓ చోట దొరుకుతుంది. అక్కడ అతను, ఇక్కడ మందు, అమ్మాయిలు తీసుకురాకూడదు అంటాడు. అంతే మీరే సప్లయి చేస్తారా! అంటాను. దానికి జనాలు తెగనవ్వేస్తున్నారు. ఇందులో నాకూ రాహుల్‌కు టైమింగ్ బాగా కుదిరింది.
- ఈ సినిమా చేశాక వస్తున్న అప్లాజ్ చూశాక. పెళ్లిచూపులు టైం గుర్తుకు వస్తుంది. ఇలా జనాలు రియాక్ట్ అవుతున్నారే. దీనికి నేను ఎలా రియాక్ట్ కావాలో నాకయితే అర్థమయితలేదు. అని చెబుతున్నాడు ప్రియదర్శి. కానీ. ఇదంతా దర్శకుడు విజన్ అంటున్నాడు. తను పిట్టగోడ అనే ప్లాప్ తీసినా జాతిరత్నాలు వంటి సిల్లీ కామెడితో సక్సెస్ ఇచ్చాడని దర్శకుడిని అభినందించాడు.