Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 19 April 2025
webdunia

ఉచిత రీచార్జ్ ఆఫర్ ప్రకటించిన ఎయిర్‌టెల్!

Advertiesment
Airtel
, సోమవారం, 17 మే 2021 (10:15 IST)
దేశంలో ఉన్న ప్రముఖ టెలికాం కంపెనీల్లో ఎయిర్‌టెల్ ఒకటి. జియో టెలికాం సర్వీసులు అందుబాటులో లేనపుడే ఎయిర్‌టెల్ అతిపెద్ద ప్రైవేట్ నెట్‌వర్క్‌గా ఉండేది. ప్రస్తుతం ఎయిర్‌టెల్ 5.5 కోట్ల యూజర్లతో రెండో అతిపెద్ద నెట్‌వర్క్‌గా వుంది. అయితే, ఈ యూవజర్లందరికీ ఎయిర్‌టెల్‌ శుభవార్త చెప్పింది. కరోనా మహమ్మరి విజృంభిస్తున్న తరుణంలో కీలక నిర్ణయం తీసుకుంది. 
 
తన నెట్‌వర్క్‌లోని తక్కువ - ఆదాయం గల 5.5 కోట్ల వినియోగదారులకు రూ.49 ప్యాక్‌ను ఒకసారి ఉచితంగా అందించనున్నట్లు పేర్కొంది. రూ.49 ప్యాక్ కింద 100 ఎంబి డేటా, 38 విలువైన టాక్ టైమ్ రూ.28 రోజుల చెల్లుబాటు కానున్నట్లు తెలపింది. గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న తమ వినియోగదారులకు అత్యవసర సమయాల్లో క్లిష్టమైన సమాచారాన్ని పంచుకోవడానికి ఇది కొంత సహాయ పడనున్నట్లు పేర్కొంది.
 
అలాగే, ఈ సమయంలో ప్రజలు తమ కుటుంబం, స్నేహితులతో కనెక్ట్ అవ్వడానికి అవసరం ఉందని గ్రహించిన ఎయిర్‌టెల్‌ తన ప్రీపెయిడ్ కస్టమర్లకు రూ.79తో రీఛార్జ్‌తో రెట్టింపు ప్రయోజనాలను పొందవచ్చని వివరించింది. ఈ కూపన్ల వల్ల క్లిష్ట సమయాల్లో వారి కుటుంబంతో కనెక్ట్ అవ్వొచ్చని పేర్కొంది. ఈ రెండు ప్రయోజనాలు రాబోయే వారం రోజుల్లో ప్రీపెయిడ్‌ వినియోగదారులకు అందుతాయని సంస్థ ప్రకటించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హమ్మయ్యా... శాంతించిన కరోనా ... 3 లక్షలకు దిగువకు...